ఈ పుస్తకం లో రాయలసీమ యాస గురించి వివరణ ,మాండలిక పదాలు,వ్యవసాయానికి సంబంధించిన పదాలు,మహ్మదీయుల పాలనలో ప్రజల భాషలో కలిసిపోయిన ఉర్దూ పదాలు,సామెతలు ఉన్నాయి.రాయలసీమ యాసలో రైతు-కూలి సంభాషణ మరియు నాగమ్మవ్వ కథ పుస్తకం చివర్లో చేర్చబడ్డాయి!ఈ పుస్తకం చదివినవారికి తెలుగు భాషపై ప్రేమ మరింత పెరుగుతుంది.ఇందులో రాయలసీమ లో వ్యవహరంలో ఉన్న ఎన్నో పదాలు కోస్తా ఆంధ్రాలో కూడా గ్రామీణ ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి.ఈ పుస్తకం చదివిన తెలుగు భాషా ప్రియులకు తమ వారసత్వం పై నమ్మకం పెరుగుతుంది.రాయలసీమ ప్రాంతానికి దూరంగా ఉంటున్న తెలుగువారికి,వారి పిల్లలకు సులభంగా భాష, యాస నేర్పడానికి,నేర్చుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది! "ప్రతి ఇరవై నాలుగు మైళ్ళ దూరానికి భాష అనేది మారుతూ ఉంటుంది" అన్న "సామెత"తో ఈ "పుస్తకం" రాయలసీమ యాస గురించి, అందంగా చెప్పడంతో మొదలవుతుంది..
© 2017,www.logili.com All Rights Reserved.