1990 - 91 లో ఖజానా ఖాళీ అయిపోవడంతో భారత ప్రభుత్వం టన్నులకొద్దీ బంగారం తీసుకేల్లిల్ విదేశీ బ్యాంకుల దగ్గర కుదువ పెట్టి, నగదు తెచ్చుకుంది. కాని,2009 లో డా సుబ్బారావు రాత్రికి రాత్రి మీడియా ప్రపంచానికి తెలియకుండా రెండు రక్షల కిలోల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కొనేశారు.. ఆలస్యంగా విషయం తెలిశాక మీడియా ప్రపంచం, రాజకీయవేత్తలూ నోళ్ళు వెళ్ళబెట్టారు. ప్రపంచంలో అన్ని సెంట్రల్ బ్యాంకులు నివ్వెరపోయాయి. రిజర్వు బ్యాంకు మునిగిందా? పెరిగిందా?
రాతిగోడల వెనకాల ఆర్ బి ఐ ఏం చేస్తోందో ఎందుకు రహస్యంగా ఉంచాలి? ప్రతి భారతీయుడి జీవితాన్ని - ధరల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా - ప్రభావితం చేసే రిజర్వు బ్యాంకులో ప్రక్రియలకి పరదాలేందుకు వేయాలి? అంటూ ఓ బృహత్ యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు డా సుబ్బారావు. ఏమిటా యజ్ఞం? ఎందుకా ఆవేశం?
భారతీయ రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్లను ముద్రించడంతో పాటు, ఈ దేశ ప్రజల్ని ఎన్ని కోణాల్లో, ఎంత లోతుగా ప్రభావితం చేస్తోందో ప్రతి భారతీయుడికి తెలిసేలా, ఆర్ బి ఐ రాతిగోడల వెనకాల జరిగే కార్యకలాపాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తూ వెలువడుతున్న మొట్టమొదటి పుస్తకం ఇదే. ఇలాంటి పుస్తకం ఇంతవరకూ ఇది ఒక్కటే.
© 2017,www.logili.com All Rights Reserved.