అమెరికాలో ఈనాటి తెలుగు వారి జీవనవిధానానికి దర్పణం - ఈ ముత్యాల్లాంటి మూడు నవలలు
'ఇప్పూడే మీ అమృత అంటీని కలసి వస్తున్నాను. ఆమె మన ఇండియన్ల పరువు తీసే పని చేస్తోంది' అంది సునంద, కొడుకు వినోద్ తో.
'ఔనా మమ్మీ! అంటీ చేస్తున్న ఆ పరువు తక్కువ పనేమిటి?' అన్నాడు వినోద్ ఆశ్చరంగా.
'ఈ వయసులో తనకో తోడు కావాలంటూ ఇంటర్నెట్ లో మెయిల్స్ పంపుతూ డేటింగ్ చేస్తోంది'
అంది సునంద.
అందులో తప్పేమిటి? మా అమ్మ కూడా అలాగే చేసి పార్టనర్ వెతుక్కుంది' అంది వినోద్ గర్ల్ ఫ్రెండ్ మరియా.
ఇంతకీ అమృత తగిన భాగస్వామిని వెతుక్కుందా? ఒంటరితనం తెచ్చే బాధలకు అక్షరరూపం "తోడు"
***********
అయినా ఈ వయసులో పరాయి మగాడి పట్ల ఈ ఆకర్షనేమిటి? మనసు మాట వినదేం? పెళ్ళయిన కొడుకు కూతురు గల ఆమె... బాధ్యతల బంధనాల నుంచి విడివడే తరుణంలో అనూహ్యంగా చివురుతోడిగిన ఈ బంధం తన జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పింది? ఏ ఏ అనుభవాల్ని రుచి చూపింది? లేటువయసులో మనసు చేసే మాయాజాలాన్ని అందంగా అక్షరీకరించిన నవల 'మరోవసంతం'
**********
అమెరికాలో స్థిరపడ్డ కొడుకులు, కోడళ్ళ వద్ద తమ శేషజీవితాన్ని గడుపుదామని, మనవళ్ళు, మనవరాళ్ళతో హాయిగా కాలక్షేపం చేద్దామని కొండంత ఆశతో వెళుతున్న తల్లితండ్రులకు అక్కడ దక్కుతున్నదేమిటి? కన్నబిడ్డలతో పాటు అక్కడి సమాజ పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? బంధాలు, అనుభంధాలు కొత్త నిర్వచనాన్ని ఎలా సంతరించుకుంటున్నాయి?
తరాల మధ్య అంతరాలతో నలుగుతున్న అమెరికన్ ఎన్నారై తల్లిదండ్రుల జీవన గతులేన్నింటినో మనుసు కదిలించేలా విశ్లేషించిన సామాజిక నవల 'సంజ వెలుగు'.
అమెరికాలో ఈనాటి తెలుగు వారి జీవనవిధానానికి దర్పణం - ఈ ముత్యాల్లాంటి మూడు నవలలు 'ఇప్పూడే మీ అమృత అంటీని కలసి వస్తున్నాను. ఆమె మన ఇండియన్ల పరువు తీసే పని చేస్తోంది' అంది సునంద, కొడుకు వినోద్ తో. 'ఔనా మమ్మీ! అంటీ చేస్తున్న ఆ పరువు తక్కువ పనేమిటి?' అన్నాడు వినోద్ ఆశ్చరంగా. 'ఈ వయసులో తనకో తోడు కావాలంటూ ఇంటర్నెట్ లో మెయిల్స్ పంపుతూ డేటింగ్ చేస్తోంది' అంది సునంద. అందులో తప్పేమిటి? మా అమ్మ కూడా అలాగే చేసి పార్టనర్ వెతుక్కుంది' అంది వినోద్ గర్ల్ ఫ్రెండ్ మరియా. ఇంతకీ అమృత తగిన భాగస్వామిని వెతుక్కుందా? ఒంటరితనం తెచ్చే బాధలకు అక్షరరూపం "తోడు" *********** అయినా ఈ వయసులో పరాయి మగాడి పట్ల ఈ ఆకర్షనేమిటి? మనసు మాట వినదేం? పెళ్ళయిన కొడుకు కూతురు గల ఆమె... బాధ్యతల బంధనాల నుంచి విడివడే తరుణంలో అనూహ్యంగా చివురుతోడిగిన ఈ బంధం తన జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పింది? ఏ ఏ అనుభవాల్ని రుచి చూపింది? లేటువయసులో మనసు చేసే మాయాజాలాన్ని అందంగా అక్షరీకరించిన నవల 'మరోవసంతం' ********** అమెరికాలో స్థిరపడ్డ కొడుకులు, కోడళ్ళ వద్ద తమ శేషజీవితాన్ని గడుపుదామని, మనవళ్ళు, మనవరాళ్ళతో హాయిగా కాలక్షేపం చేద్దామని కొండంత ఆశతో వెళుతున్న తల్లితండ్రులకు అక్కడ దక్కుతున్నదేమిటి? కన్నబిడ్డలతో పాటు అక్కడి సమాజ పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? బంధాలు, అనుభంధాలు కొత్త నిర్వచనాన్ని ఎలా సంతరించుకుంటున్నాయి? తరాల మధ్య అంతరాలతో నలుగుతున్న అమెరికన్ ఎన్నారై తల్లిదండ్రుల జీవన గతులేన్నింటినో మనుసు కదిలించేలా విశ్లేషించిన సామాజిక నవల 'సంజ వెలుగు'.© 2017,www.logili.com All Rights Reserved.