తెలుగునాట జన్మించి ఆంగ్లపత్రికా రంగంలో శిఖరస్థాయిని అందుకొని మనదేశంలోనే గాక, ఇతర దేశాలలోనూ కీర్తిగడించిన జర్నలిస్టు శ్రీ ఎ ఎస్ రామన్. దేశ స్వాతంత్ర్యసిద్ధికి పూర్వం, అటు తరువాత కూడా కొంతకాలం పాటు ఆంగ్లపత్రికా సామ్రాజ్యాన్ని ఏలిన కోటంరాజు పున్నయ్య, రామారావు, ఖాసా సుబ్బారావు, కందూరి ఈశ్వరదత్తు తరువాత తిరిగి అంతటి వాడనిపించుకున్న మేటి సంపాదకుడాయన. ఇంగ్లీషు భాషమీద పట్టు, రచనాశైలి, పాత్రికేయ విలువలపట్ల నిబద్ధత, రాజీలేని భావ వ్యక్తీకరణ స్వేచ్చ రామన్ ను వరిష్ఠ పాత్రికేయునిగా తీర్చిదిద్దాయి.
కోటంరాజు రామారావు గారి The Pen As My Sword వలె, ఈశ్వరదత్తుగారి The Street Of Ink వలె రామన్ గారి స్వీయచరిత్ర లాంటి గ్రంథం ఏదైనా ఉంటే జర్నలిస్టుగా ఆయన జీవితవిశేషాలు ఎన్నెన్నో తెలిసి ఉండేవి. ఆయన జీవితచరిత్రలేని కొరత తీర్చటానికి ఆయన మరణించిన ఒక పుష్కరకాలం తరువాత డాక్టర్ అవధానం నాగరాజారావు గారు చేసిన శ్లాఘనీయమైన ఒక మంచి ప్రయత్నం ఇప్పుడు మీరు చూస్తున్న సంపాదకశిల్పి పద్మశ్రీ డాక్టర్ ఎ ఎస్ రామన్ గ్రంథం.
తెలుగునాట జన్మించి ఆంగ్లపత్రికా రంగంలో శిఖరస్థాయిని అందుకొని మనదేశంలోనే గాక, ఇతర దేశాలలోనూ కీర్తిగడించిన జర్నలిస్టు శ్రీ ఎ ఎస్ రామన్. దేశ స్వాతంత్ర్యసిద్ధికి పూర్వం, అటు తరువాత కూడా కొంతకాలం పాటు ఆంగ్లపత్రికా సామ్రాజ్యాన్ని ఏలిన కోటంరాజు పున్నయ్య, రామారావు, ఖాసా సుబ్బారావు, కందూరి ఈశ్వరదత్తు తరువాత తిరిగి అంతటి వాడనిపించుకున్న మేటి సంపాదకుడాయన. ఇంగ్లీషు భాషమీద పట్టు, రచనాశైలి, పాత్రికేయ విలువలపట్ల నిబద్ధత, రాజీలేని భావ వ్యక్తీకరణ స్వేచ్చ రామన్ ను వరిష్ఠ పాత్రికేయునిగా తీర్చిదిద్దాయి. కోటంరాజు రామారావు గారి The Pen As My Sword వలె, ఈశ్వరదత్తుగారి The Street Of Ink వలె రామన్ గారి స్వీయచరిత్ర లాంటి గ్రంథం ఏదైనా ఉంటే జర్నలిస్టుగా ఆయన జీవితవిశేషాలు ఎన్నెన్నో తెలిసి ఉండేవి. ఆయన జీవితచరిత్రలేని కొరత తీర్చటానికి ఆయన మరణించిన ఒక పుష్కరకాలం తరువాత డాక్టర్ అవధానం నాగరాజారావు గారు చేసిన శ్లాఘనీయమైన ఒక మంచి ప్రయత్నం ఇప్పుడు మీరు చూస్తున్న సంపాదకశిల్పి పద్మశ్రీ డాక్టర్ ఎ ఎస్ రామన్ గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.