ఏ పూజో, వ్రతమో లేక మరెలాంటి ఆధ్యాత్మిక క్రతువు మనం చేసుకుంటున్నా అది చిన్నదిగానీ, పెద్దదిగానీ రెండింటిని మాత్రం మనం పీఠం మీద ఉంచుతాం. ఒకటి కలశము. రెండు దీపము. ఒకటి వేడి రెండోది చల్లనైనది. ఇది శ్వాసకు సంబంధించినది. కుడి ముక్కు ద్వారా ప్రయాణించే వేడి శ్వాస. ఎడమ ముక్కు ద్వారా ప్రయాణించే చల్లని శ్వాస అని. ఒకటి యోగాన్ని, రెండోది క్షేమాన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అనుకున్న ఫలితాలు రాకపోతే మన శ్వాసలోనే జరగవలసిన మార్పు జరగలేదు అని గుర్తు. శ్వాసను సక్రమంగా పీల్చుకుంటే సూర్యుడంతటివాళ్ళము అవచ్చు అన్నారు. లోపలికెళ్ళిన శ్వాస ఒకటి. తీరా లోపలికెళ్ళిన శ్వాస కుడివైపు మూడు పాయలుగా, ఎడమవైపు రెండు పాయలుగా మారి మళ్ళీ ఒకటై బయటికొస్తుంది.
శ్వాసను గమనిస్తూ పీల్చుకునేవారికి రోగాలు రావు. మరో విషయం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. భూమిపైన మూడొంతుల నీరు ఉన్నట్లే శరీరంలో కూడా అంతే నీరుండాలి. నేడు వర్షాలు సకాలంలో పడకపోవడం, భూమిలో నీటి శాతం తగ్గిపోవటానికి కారణం మన శరీరాల్లో నీటి శాతం తగ్గిపోవడమే. ఈ శ్వాస మహావిజ్ఞాన్ లోని ఇలాంటి అమూల్యమైన అంశాలు మనం వంటబట్టించుకుంటే గురువులకుపయోగపడే శరీరాలను తయారు చేసుకోవచ్చు.
ఏ పూజో, వ్రతమో లేక మరెలాంటి ఆధ్యాత్మిక క్రతువు మనం చేసుకుంటున్నా అది చిన్నదిగానీ, పెద్దదిగానీ రెండింటిని మాత్రం మనం పీఠం మీద ఉంచుతాం. ఒకటి కలశము. రెండు దీపము. ఒకటి వేడి రెండోది చల్లనైనది. ఇది శ్వాసకు సంబంధించినది. కుడి ముక్కు ద్వారా ప్రయాణించే వేడి శ్వాస. ఎడమ ముక్కు ద్వారా ప్రయాణించే చల్లని శ్వాస అని. ఒకటి యోగాన్ని, రెండోది క్షేమాన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అనుకున్న ఫలితాలు రాకపోతే మన శ్వాసలోనే జరగవలసిన మార్పు జరగలేదు అని గుర్తు. శ్వాసను సక్రమంగా పీల్చుకుంటే సూర్యుడంతటివాళ్ళము అవచ్చు అన్నారు. లోపలికెళ్ళిన శ్వాస ఒకటి. తీరా లోపలికెళ్ళిన శ్వాస కుడివైపు మూడు పాయలుగా, ఎడమవైపు రెండు పాయలుగా మారి మళ్ళీ ఒకటై బయటికొస్తుంది. శ్వాసను గమనిస్తూ పీల్చుకునేవారికి రోగాలు రావు. మరో విషయం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. భూమిపైన మూడొంతుల నీరు ఉన్నట్లే శరీరంలో కూడా అంతే నీరుండాలి. నేడు వర్షాలు సకాలంలో పడకపోవడం, భూమిలో నీటి శాతం తగ్గిపోవటానికి కారణం మన శరీరాల్లో నీటి శాతం తగ్గిపోవడమే. ఈ శ్వాస మహావిజ్ఞాన్ లోని ఇలాంటి అమూల్యమైన అంశాలు మనం వంటబట్టించుకుంటే గురువులకుపయోగపడే శరీరాలను తయారు చేసుకోవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.