ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014 ఆరవ చట్టంగా అసాధారణ రాజపత్రంలో ప్రచురితమునకు యథాతథ తెలుగు అనువాదం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 168 ని అనుసరించి రాష్ట్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ చట్టం రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్ గా భిన్నంగా రూపొందింపబడినదని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ చట్టాన్ని న్యాయస్థానములలో ప్రశ్నించటం గానీ, వ్యతిరేకించటం గానీ జరగలేదు. కానీ ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లకు వివరణలకై కొందరు కక్షిదారులు న్యాయ స్థానములను ఆశ్రయించగా, న్యాయ స్థానములు ఇచ్చిన తీర్పులను పాఠకుల సౌకర్యార్థం ఇందులో పొందుపరచటమైనది. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు నేడు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు వాటి యొక్క పరిష్కారానికి సంబంధించి స్వాంత్రానికి పూర్వం నుండి ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలను వాటి పర్యవసానం, నేటి పరిస్థితులను సెక్షన్ 89 క్రింద సవివరముగా పొందుపరచటం జరిగింది. అంతేకాకుండా నవ్యంధ్రరాష్ట్రానికి వ్యవసాయానికి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్ట్ గురించి సవివరముగా నోటిఫికేషన్ ను పొందుపరచటం జరిగింది. - డా. పోతరాజు వెంకటేశ్వరరావు