నేను వ్రాసిన రెండు పద్యనాటికల సమాహార మీ పుస్తకము. ఇందులో మొదటి నాటకము 'వాణి నారాణి' అనునది. ఇది శ్రీనాథ మహాకవికి, పెద్దనాదిప్రబంధకవులకు సంధికాలములో నుండి ప్రబంధమార్గమునకు మార్గదర్శకుడైన మహాకవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని గురించిన ఐతిహ్యము నాదారముగా చేసికొని వ్రాసినది. ఈ ఐతిహ్యము నాకు 7వక్లాసులో ఉన్న తెలుగు ఉపవాచకములో ఉండెను.
దాదాపు 60 సంవత్సరముల తర్వాత దాని నీరూపముగా పునశ్చరణము చేసికొను అవకాశము భారతీదేవి ప్రసాదించినందులకు సంతోషముగా ఉన్నది. ముఖ్యముగా పినవీరనకు గల సరస్వత్యుపాసనశక్తిని ప్రతిబింబించున దీ ఐతిహ్యము. ఈ నాటకములో పినవీరన శృంగారశాకుంతలము, జైమినిభారతముల నుండి సందర్భానుసారముగా గ్రహింపబడిన పద్యములు కొన్ని యున్నవి. మిగతాపద్యములు, దండకము, శ్లోకము, గీతము లన్నియు నేను వ్రాసినవి.
నేను వ్రాసిన రెండు పద్యనాటికల సమాహార మీ పుస్తకము. ఇందులో మొదటి నాటకము 'వాణి నారాణి' అనునది. ఇది శ్రీనాథ మహాకవికి, పెద్దనాదిప్రబంధకవులకు సంధికాలములో నుండి ప్రబంధమార్గమునకు మార్గదర్శకుడైన మహాకవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని గురించిన ఐతిహ్యము నాదారముగా చేసికొని వ్రాసినది. ఈ ఐతిహ్యము నాకు 7వక్లాసులో ఉన్న తెలుగు ఉపవాచకములో ఉండెను. దాదాపు 60 సంవత్సరముల తర్వాత దాని నీరూపముగా పునశ్చరణము చేసికొను అవకాశము భారతీదేవి ప్రసాదించినందులకు సంతోషముగా ఉన్నది. ముఖ్యముగా పినవీరనకు గల సరస్వత్యుపాసనశక్తిని ప్రతిబింబించున దీ ఐతిహ్యము. ఈ నాటకములో పినవీరన శృంగారశాకుంతలము, జైమినిభారతముల నుండి సందర్భానుసారముగా గ్రహింపబడిన పద్యములు కొన్ని యున్నవి. మిగతాపద్యములు, దండకము, శ్లోకము, గీతము లన్నియు నేను వ్రాసినవి.© 2017,www.logili.com All Rights Reserved.