శ్రీకళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు
తిరుమల కృష్ణ దేశికాచార్యులు: తెలంగాణములోని పాలమూరు జిల్లా, బల్మూరు గ్రామంలో జన్మించినారు. తల్లిదండ్రులు శ్రీమాన్ తిరుమల రామతాతాచార్యులు, ఆదిలక్ష్మమ్మగార్లు. శఠమర్షణగోత్రీకులు, ఆపస్తంబ సూత్రులు. వనపర్తి హైస్కూలులో హైస్కూలు వరకు చదివి, నిజాం కాలేజి, ఉస్మానియా యూనివర్శిటీలలో M.Sc పూర్తి చేసినారు. అటు పైన కెనడాలోని University of Western Ontario Ph.d (Astronomy), McMaster University M.Sc (Computer Science) పూర్తిచేసినారు. న్యూజీలాండులోని University of Canterbury లో పరిశోధకునిగాను, Osmania University లో అధ్యాపకునిగాను పనిచేసినారు. ఆతర్వాత Atomic Energy of Canada లోను New Flyer Industries లోను Computer Scientistగా పనిచేసి ఉద్యోగవిరమణ తర్వాత ఇప్పుడు టొరంటోలో ఉంటున్నారు. రచనలు: 1.అశ్రుమాల, 2.హనుమప్పనాయకుడు, 3.జక్కనచరిత్ర, 4. ఋతు సంహారము, 5.కవితా స్రవంతి (పద్యకావ్యములు) ఇంకను అనేక పద్యఖండికలు, పద్యనాటికలు, పద్యప్రహసనములు. హిందీనవల చిత్రలేఖానువాదము. వైదికసంస్కార ప్రయోగగ్రంథములు 'పూర్వప్రయోగః', 'అపరప్రయోగచంద్రికా', 'శ్రాద్ధప్రయోగః'. వీరి ఋతుసంహారమునకు బందరులో 'విశ్వనాథ కవితాభారతి' అనుసంస్థ 'విశ్వనాథ' అవార్డు నొసంగినది. జక్కన కావ్యమును వ్రాసిన తర్వాత 'తానా' సంస్థ తానా విశిష్ట పురస్కారము నిచ్చినది. సాహిత్యకృషికి షికాగో 'ఆటా' సభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ 'విశ్వనాథ' అవార్డు ప్రదానము చేసినది. సాహిత్యము, తెలుగులిపుల కృషికిగాను ఇటీవల షికాగోలోని 'సప్నా' సంస్థ 'శ్రీకళాపూర్ణ' బిరుదును ప్రదానము చేసినది.
శ్రీకళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు తిరుమల కృష్ణ దేశికాచార్యులు: తెలంగాణములోని పాలమూరు జిల్లా, బల్మూరు గ్రామంలో జన్మించినారు. తల్లిదండ్రులు శ్రీమాన్ తిరుమల రామతాతాచార్యులు, ఆదిలక్ష్మమ్మగార్లు. శఠమర్షణగోత్రీకులు, ఆపస్తంబ సూత్రులు. వనపర్తి హైస్కూలులో హైస్కూలు వరకు చదివి, నిజాం కాలేజి, ఉస్మానియా యూనివర్శిటీలలో M.Sc పూర్తి చేసినారు. అటు పైన కెనడాలోని University of Western Ontario Ph.d (Astronomy), McMaster University M.Sc (Computer Science) పూర్తిచేసినారు. న్యూజీలాండులోని University of Canterbury లో పరిశోధకునిగాను, Osmania University లో అధ్యాపకునిగాను పనిచేసినారు. ఆతర్వాత Atomic Energy of Canada లోను New Flyer Industries లోను Computer Scientistగా పనిచేసి ఉద్యోగవిరమణ తర్వాత ఇప్పుడు టొరంటోలో ఉంటున్నారు. రచనలు: 1.అశ్రుమాల, 2.హనుమప్పనాయకుడు, 3.జక్కనచరిత్ర, 4. ఋతు సంహారము, 5.కవితా స్రవంతి (పద్యకావ్యములు) ఇంకను అనేక పద్యఖండికలు, పద్యనాటికలు, పద్యప్రహసనములు. హిందీనవల చిత్రలేఖానువాదము. వైదికసంస్కార ప్రయోగగ్రంథములు 'పూర్వప్రయోగః', 'అపరప్రయోగచంద్రికా', 'శ్రాద్ధప్రయోగః'. వీరి ఋతుసంహారమునకు బందరులో 'విశ్వనాథ కవితాభారతి' అనుసంస్థ 'విశ్వనాథ' అవార్డు నొసంగినది. జక్కన కావ్యమును వ్రాసిన తర్వాత 'తానా' సంస్థ తానా విశిష్ట పురస్కారము నిచ్చినది. సాహిత్యకృషికి షికాగో 'ఆటా' సభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ 'విశ్వనాథ' అవార్డు ప్రదానము చేసినది. సాహిత్యము, తెలుగులిపుల కృషికిగాను ఇటీవల షికాగోలోని 'సప్నా' సంస్థ 'శ్రీకళాపూర్ణ' బిరుదును ప్రదానము చేసినది.© 2017,www.logili.com All Rights Reserved.