కాలాతీత వ్యక్తి... కబీరు |
అతని అక్షరాలు - శ్వాసిస్తాయి ...! అతని వాక్కు - సమాజాన్ని శాశిస్తుంది ...!!
సర్వజనుల సుఖాన్ని, సమత్వాన్ని కాంక్షిస్తుంది...!!! అతను రాజులకు రాజు ... రారాజు...!
యోగిపుంగవులకన్న సమున్నతుడు ... పరమహంస...!! ఉనికి భూతలమైనా... మనికి ఆ పరాత్పరుని యందు .... మనసులో ... సంశయానికి తావులేదు ...! మాటలో ... ద్వివిధ లేదు ....!! తాను నమ్మిన ప్రశస్తమైన వెలుగుబాటన సాగిన ప్రయాణం .... “తొలి సంజెలో తెల్వి దూకి వచ్చిన యట్లు” తాను తొలిపొద్దు కిరణమై ఇహపర జీవనానికి తీరైన త్రోవజూపిన క్రాంతి దాత ....!! అతడు ... “కబీరు”.... ... కాలాతీత వ్యక్తి ...!!
ఒక్క మానవత్వానికి తప్ప, ఏ కాలానికీ, ఏ సమాజానికీ ఒదగని విరాట్ తత్త్వం. ఏ బంధనాలకీ కట్టుబడని ఉన్ముక్తు డాతడు. అతని ప్రఖరమైన వ్యక్తిత్వం - ఆతని మాటకు “మెఱుపు” నిచ్చింది .....!
నేర్పరియైన విలుకాని బాణమై దూసుకుపోయి లక్ష్యాన్ని గురిచూసి కొట్టింది. వీరుని ఖడ్గ ప్రహారమై, ఒక్క వేటుతో అజ్ఞానాన్ని ముక్కలు చేసింది.
సమకాలీన సమాజంలోని, సంప్రదాయాల్లోని, మతాచారాల్లోని, డొల్లతనాన్నీ, మిథ్యాతత్త్వాన్ని, సంకీర్ణతనీ, స్వార్థాన్నీ, నిస్సిగ్గునూ నిష్పాక్షికంగా ఎండ గట్టింది.
ఆతడు నిర్భయుడైన సత్యవాది ... అసత్యమన్న ఏవగింపు ....... ఆ ఏవగింపును ఏమాత్రం దాచుకోడు కూడా ...
కాలాతీత వ్యక్తి... కబీరు | అతని అక్షరాలు - శ్వాసిస్తాయి ...! అతని వాక్కు - సమాజాన్ని శాశిస్తుంది ...!! సర్వజనుల సుఖాన్ని, సమత్వాన్ని కాంక్షిస్తుంది...!!! అతను రాజులకు రాజు ... రారాజు...! యోగిపుంగవులకన్న సమున్నతుడు ... పరమహంస...!! ఉనికి భూతలమైనా... మనికి ఆ పరాత్పరుని యందు .... మనసులో ... సంశయానికి తావులేదు ...! మాటలో ... ద్వివిధ లేదు ....!! తాను నమ్మిన ప్రశస్తమైన వెలుగుబాటన సాగిన ప్రయాణం .... “తొలి సంజెలో తెల్వి దూకి వచ్చిన యట్లు” తాను తొలిపొద్దు కిరణమై ఇహపర జీవనానికి తీరైన త్రోవజూపిన క్రాంతి దాత ....!! అతడు ... “కబీరు”.... ... కాలాతీత వ్యక్తి ...!! ఒక్క మానవత్వానికి తప్ప, ఏ కాలానికీ, ఏ సమాజానికీ ఒదగని విరాట్ తత్త్వం. ఏ బంధనాలకీ కట్టుబడని ఉన్ముక్తు డాతడు. అతని ప్రఖరమైన వ్యక్తిత్వం - ఆతని మాటకు “మెఱుపు” నిచ్చింది .....! నేర్పరియైన విలుకాని బాణమై దూసుకుపోయి లక్ష్యాన్ని గురిచూసి కొట్టింది. వీరుని ఖడ్గ ప్రహారమై, ఒక్క వేటుతో అజ్ఞానాన్ని ముక్కలు చేసింది. సమకాలీన సమాజంలోని, సంప్రదాయాల్లోని, మతాచారాల్లోని, డొల్లతనాన్నీ, మిథ్యాతత్త్వాన్ని, సంకీర్ణతనీ, స్వార్థాన్నీ, నిస్సిగ్గునూ నిష్పాక్షికంగా ఎండ గట్టింది. ఆతడు నిర్భయుడైన సత్యవాది ... అసత్యమన్న ఏవగింపు ....... ఆ ఏవగింపును ఏమాత్రం దాచుకోడు కూడా ...© 2017,www.logili.com All Rights Reserved.