జీవావరణశాస్త్రంలో వేడినీటిలో కప్ప ఉదంతం అందరికి తెలిసే ఉంటుంది. చల్లటినీటి నుంచి కప్పను వేడినీటిలోకి వేస్తే వెంటనే బయటకు గెంతుతుంది. అదే చల్లటినీటిని నిదానంగా వేడిచేస్తూ ఉంటె వేడినీటికి కప్ప అలవాటు పడుతూ మరిగేనీటిలో కప్ప చనిపోతుంది. జీవశాస్త్రం ప్రకారం ఇందులో నిజం లేకపోయినా ద్రవిడతనం పుష్కలంగా ఉన్న తెలుగు భాషావరణం అనే పరిశుభ్రమైన నీటిని పాళీ, సంస్కృతం, ఆంగ్లం లాంటి ఇతర భాషలు శతాబ్దాలుగా ప్రభావితం చేస్తూ ఉండగా కలుగబోయే ప్రమాదాలను మనం ఉహించలేకపోయాం. తెలుగును భాషగా రక్షించలేకపోతున్నామని పలువురు కలవరపడుతున్నారు .