విద్యుత్ శక్తీ మన ఊళ్లోనూ, ఇళ్లను చేరకముందు , అనగా, ఓ నాలుగైదు దశాబ్దాల క్రితం రాత్రి ఆకాశం మనోహరంగా కనిపించేది. గ్రామాల్లో ఎక్కువగా ఆరుబయటే పడుకునేవారు. నక్షత్రాలవంక చూస్తూ పెద్దలు పిల్లలకు కథలు చెబుతూ నిద్రపుచ్చేవారు. ఆ రోజుల్లో చీకటిపడగానే మినుకుమినుకుమంటూ ఎన్నోతరాలు మనల్ని పలుకరించేవి. మానవజాతి ఆవిర్భావం నుంచి సరిహద్దలు లేని ఆకాశం మనం ఎంత అల్పులమో గుర్తు చేసేది. నేటి విద్యుత్ యుగంలో , కాంతి కాలుష్యంవల్ల ప్రకృతిని ఆస్వాదించే రోజులు దూరమయ్యాయి. సహాజమైన సూర్యాస్తమయాలు, రాత్రిళ్లను ఆస్వాదించటం తగ్గిపోయింది. త్వరగా నిద్రించి, సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు కూడా మాయమయింది. గ్రహణాలు కలుగుతాయని వార్త తెలియడం ఆలస్యం తలుపులేసుకుని లోపలే ఉంటున్నారు. వాటిని చూసి అర్ధం చేసుకునే మనస్తత్వం కూడ లోపిస్తున్నది.