ఒక భాష మాట్లాడే వారిని ఒక జాతిగా పరిగణించటం ఒక భావన. ఆ జాతి తన భాషా రచయితలని తమ జాతి సంపదగా భావిస్తారు. గౌరవిస్తారు. స్వంతం చేసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయం. 30-40ల వరకూ తెలుగు సాహిత్యం అనేది ఉండేదనిపిస్తుంది. ఆ తర్వాత సీరియస్ రచనలను అభ్యుదయ, అభ్యుదయ వ్యతిరేకాలుగా వర్గీకరణ మొదలయింది. ఆ వర్గీకరణ 90ల వరకూ ప్రధాన స్రవంతి అయింది. ఆ తర్వాత భౌగోళిక వర్గీకరణ ఆరంభమయింది. కులవర్గీకరణ ముమ్మరమయింది. ఒక వ్యక్తిలో కలిగిన ఆలోచన వెనక ఒక సమాజం ఉంటుందని రెండు శతాబ్దాలకి పైగా అనుకుంటున్నారు.
ఆ సమాజం వర్గ సమాజం అన్న మార్క్స్ సూత్రీకరణ తెలుగు వారు కూడా అనుసరించారు. చైతన్యానికి ప్రేరణ, వ్యక్తరూపాలు భిన్నం కావచ్చు కాని అంతిమంగా ఉపరితలం పునాది మీదనే అనే చైతన్యానికి చేరుకుంటారని భావించారు. చాల కాలం వరకూ ఉమ్మడి గౌరవాలందుకున్న గురజాడది ఏ ప్రాంతం వీరేశలింగంది ఏ కులం అనే ప్రశ్నలు వచ్చాయి. ఇది ఇంతటితో ముగిసేది కాదు. తెలుగు జాతి అనేది గట్టిపడక ముందే పిగిలిపోయింది. ఇదీ నా అంచనా. ఇప్పుడు తెలుగు సాహిత్యం అనేది లేదు. ఇకపై ఉండదు. కనక కాళీపట్నం రామారావు బహుశా తెలుగు సాహిత్యపు ఉమ్మడి గుర్తుగా చూడబడిన వారిలో చివరివారు కావచ్చుననుకుంటున్నాను.
ఒక భాష మాట్లాడే వారిని ఒక జాతిగా పరిగణించటం ఒక భావన. ఆ జాతి తన భాషా రచయితలని తమ జాతి సంపదగా భావిస్తారు. గౌరవిస్తారు. స్వంతం చేసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయం. 30-40ల వరకూ తెలుగు సాహిత్యం అనేది ఉండేదనిపిస్తుంది. ఆ తర్వాత సీరియస్ రచనలను అభ్యుదయ, అభ్యుదయ వ్యతిరేకాలుగా వర్గీకరణ మొదలయింది. ఆ వర్గీకరణ 90ల వరకూ ప్రధాన స్రవంతి అయింది. ఆ తర్వాత భౌగోళిక వర్గీకరణ ఆరంభమయింది. కులవర్గీకరణ ముమ్మరమయింది. ఒక వ్యక్తిలో కలిగిన ఆలోచన వెనక ఒక సమాజం ఉంటుందని రెండు శతాబ్దాలకి పైగా అనుకుంటున్నారు. ఆ సమాజం వర్గ సమాజం అన్న మార్క్స్ సూత్రీకరణ తెలుగు వారు కూడా అనుసరించారు. చైతన్యానికి ప్రేరణ, వ్యక్తరూపాలు భిన్నం కావచ్చు కాని అంతిమంగా ఉపరితలం పునాది మీదనే అనే చైతన్యానికి చేరుకుంటారని భావించారు. చాల కాలం వరకూ ఉమ్మడి గౌరవాలందుకున్న గురజాడది ఏ ప్రాంతం వీరేశలింగంది ఏ కులం అనే ప్రశ్నలు వచ్చాయి. ఇది ఇంతటితో ముగిసేది కాదు. తెలుగు జాతి అనేది గట్టిపడక ముందే పిగిలిపోయింది. ఇదీ నా అంచనా. ఇప్పుడు తెలుగు సాహిత్యం అనేది లేదు. ఇకపై ఉండదు. కనక కాళీపట్నం రామారావు బహుశా తెలుగు సాహిత్యపు ఉమ్మడి గుర్తుగా చూడబడిన వారిలో చివరివారు కావచ్చుననుకుంటున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.