శాస్త్రీయ నామం : Digera Muricata
కన్నడ నామం : గొర్జిసొప్పు, చెంచలి సొప్పు, కంకల సొప్పు
సంస్కృత నామం : కుణంజర, కురంజర, అరణ్య వస్తుక
తినదగిన భాగాలు : వేర్లు, బలిసిన కాండము మినహా మొత్తం మొక్క తినదగినది
పోషక విలువలు : విటమన్ “ఎ”, విటమిన్ "సి" రిభొఫ్లెవిన్, కాపర్, ఐరన్, నికెల్, మాంగనీస్, జింక్
ఔషధీయ విలువలు - మూత్రపిండాల్లో వున్న రాళ్ళను కరిగిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో చెంచులకు, గురుగాకు తెలియని గ్రామీణులు చాలా అరుదు. చెంచలి కూర పంటపొలాల్లో కలుపు మొక్కగా పెరుగుతుంది. వేరుశెనగ పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నల్లమల అడవుల్లో వున్న చెంచులు అధికంగా ఈ ఆకుకూరను ఆహారంగా ఉపయోగించడం వల్ల దీనికి చెంచులకు అని పేరొచ్చిందేమో తెలియదు. చెంచలి కూర చెంచుల కూరకు అపభ్రంశ శబ్దము కావచ్చు. నంద్యాలలో చెంచుగడ్డ (చెంచులగడ్డ) అన్న కందమూలము కూడా దొరకడం నాకు తెలుసు. గంపలలో తెచ్చి ప్రభుత్వ పాఠశాలల దగ్గర అమ్మితే పేదల పిల్లలు, ఐదు పైసలకు, పది పైసలకు కొని తినేవాళ్ళు. ఇప్పుడైతే చెంచుగడ్డలు అమ్మడం నంద్యాలలో కానీ, దాని చుట్టు ప్రక్కల ఊళ్ళలో కాని కనిపించడం లేదు. చెంచులకు.......................
© 2017,www.logili.com All Rights Reserved.