"ప్రాచీన శ్రేష్ఠ భాషగా తెలుగు చరిత్ర కొన్ని కొత్త చూపులు" పరిశోధనా గ్రంథం అనేక కొత్త చూపులకు తెరలు తీస్తోంది. క్లాసికల్ భాష అనే భావన పుట్టు పూర్వోత్తరాలు. తెలుగు చారిత్రక వికాసాలపై లోతైన చర్చ చేస్తూ కొత్తకోణాలను ఆవిష్కరిస్తోన్న రచన ఇది. తెలుగు భాషకు క్లాసికల్ హోదా వచ్చినప్పుడు దానికి ఒక చక్కని తెలుగు పేరు ఏదనే చర్చ జరిగింది. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రాచీన విశిష్ట సంపన్న భాష అన్నారు. మేలిమి తెలుగు, ప్రాచీన తెలుగు ఇలా మరికొన్ని సూచనలు కూడా వచ్చాయి. ప్రాచీన శ్రేష్ఠ భాషగా దాన్ని ఆచార్య గంగిశెట్టివారు భావించారు. పత్రికలు ప్రాచీనతా హోదా అని వ్రాసేయడంతో ఈ ఐదారేళ్లుగా అదే స్థిరపడిపోయింది. ఒక సనాతన, ధార్మిక ప్రపత్తి కలిగిన ప్రాచీన భాషకి క్లాసికల్ భాషగా వ్యవహరించారని ఈ పుస్తకంలో లక్ష్మీనారాయణగారు వివరించారు. నిజానికి, ప్రాచీన శ్రేష్ఠత - శ్రేష్ఠ ప్రాచీనతల గురించి గట్టి పరిశోధనలు లేకుండానే ఈ ఐదేళ్ళు గడిచిపోయాయి. ప్రాచీనతా ఫలాలు మన చేతికి ఇంకా అందనే లేదు. ఈ పరిస్థితుల్లో ఆచార్య గంగిశెట్టివారు ఈ రచన వెలువడటం ఆనందదాయకం.

© 2017,www.logili.com All Rights Reserved.