వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినా దాని ఫలితాలు అందరికీ అందుబాటులో లేవు. అందుకనే నేటికీ నాటు వైద్యాలు, మోటు వైద్యాలు రోగుల పాలిట శాపాలుగా మిగిలాయి. వైద్య సేవలు అందుబాటులో లేనప్పుడు స్వంత వైద్యం తప్పనిసరి. వైద్యం ఖరీదు అయినప్పుడు మరింత అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో రోగి రిస్క్ తీసుకోక తప్పదు. ఇది ఎవరైనా ఒప్పుకుంటారు. స్వంత వైద్యం అవసరం ఉన్నా లేకపోయినా డాక్టర్ చెప్పింది అక్షరాలా పాటించడానికి కొంత అవగాహన కావాలి. అందుకోసమే ఈ పుస్తకం.
ఈ రోజున పత్రికలూ, రేడియోలు, టి వి లలో ఆరోగ్యం గురించి కుప్పలు తెప్పలుగా సమాచారం గుప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదో ఒక అనారోగ్యం కలగక తప్పదు. అనారోగ్యం కలిగినప్పుడు తనకి వచ్చిన వ్యాధి గురించి తెలుసుకోవాలని రోగి ఆరాటం చెందుతాడు.
కనీసం తన గురించి కాకపోయినా, తనవాళ్ళకి వ్యాధి వస్తే, అది ఎలా తగ్గుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకోవాలని తహతహలాడతాడు. వ్యాధి గురించి అవగాహన లేనప్పుడు ఎవరైనా సరే గంధరగోళంలో పడతారు. తలా ఒకరు తలా ఒకటి చెబుతారు. ఏది చేయాలో, ఎలా చేయాలో తెలియని స్థితి వారిని కుదిపేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికీ తోడ్పడాలనే ధ్యేయంతో ఈ పుస్తకం రాశాను. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలనీ, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- సమరం
వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినా దాని ఫలితాలు అందరికీ అందుబాటులో లేవు. అందుకనే నేటికీ నాటు వైద్యాలు, మోటు వైద్యాలు రోగుల పాలిట శాపాలుగా మిగిలాయి. వైద్య సేవలు అందుబాటులో లేనప్పుడు స్వంత వైద్యం తప్పనిసరి. వైద్యం ఖరీదు అయినప్పుడు మరింత అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో రోగి రిస్క్ తీసుకోక తప్పదు. ఇది ఎవరైనా ఒప్పుకుంటారు. స్వంత వైద్యం అవసరం ఉన్నా లేకపోయినా డాక్టర్ చెప్పింది అక్షరాలా పాటించడానికి కొంత అవగాహన కావాలి. అందుకోసమే ఈ పుస్తకం. ఈ రోజున పత్రికలూ, రేడియోలు, టి వి లలో ఆరోగ్యం గురించి కుప్పలు తెప్పలుగా సమాచారం గుప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదో ఒక అనారోగ్యం కలగక తప్పదు. అనారోగ్యం కలిగినప్పుడు తనకి వచ్చిన వ్యాధి గురించి తెలుసుకోవాలని రోగి ఆరాటం చెందుతాడు. కనీసం తన గురించి కాకపోయినా, తనవాళ్ళకి వ్యాధి వస్తే, అది ఎలా తగ్గుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకోవాలని తహతహలాడతాడు. వ్యాధి గురించి అవగాహన లేనప్పుడు ఎవరైనా సరే గంధరగోళంలో పడతారు. తలా ఒకరు తలా ఒకటి చెబుతారు. ఏది చేయాలో, ఎలా చేయాలో తెలియని స్థితి వారిని కుదిపేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికీ తోడ్పడాలనే ధ్యేయంతో ఈ పుస్తకం రాశాను. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలనీ, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. - సమరం© 2017,www.logili.com All Rights Reserved.