తన ఒడుపును పెంచుకునేందుకు, తన శ్రమకు ఫలితాన్ని రెండింతలుగా చేసుకునేందుకు, శ్రమించే సమయాన్ని అదా చేసుకునేందుకు మానవుని ప్రయాత్నం రాతియుగంలోనే మొదలయింది. మరోవిధంగా చెప్పాలంటే, ఆలోచించే మెదడు ఎప్పుడు రూపొందిందో అప్పుడే ఆ ప్రయత్నం పుట్టుకొచ్చింది. రాతి పనిముట్లతో ఆ ప్రయత్నం సాకారమై , విల్లనంబులతో నడక నేర్చి, బండిచక్రం ఆవిష్కరణతో మూడు దశలను దాటుకుంది. ఆ ప్రయత్నాల వెనుక ఒక శాస్త్రమూ లేదు, అక్షరజ్ఞానమూ లేదు. ప్రయత్నంమీద ప్రయత్నంతో గడించిన అనుభవమే ఆనాటి దారిదీపం.