కంభంవారిగారు తల కమ్యూనిస్టుల్లో ప్రథములని చెప్పాలి. చరిత్ర రచనలో ఆయన అందెవేసిన చేయి. మార్సిస్టు దృక్కోణాన్నుండి “ఆంధ్రప్రదేశ్ చరిత్ర - సంస్కృతి” అనే గ్రంథాన్ని రాశాడు. మార్క్సిస్టు దృక్కోణాన్నుండి సమగ్ర రచనగా వెలువడిన మొదటి గ్రంథం అదే కావచ్చు. పుస్తక రచనకు అవసరమైన సమాచార సేకరణ కోసం (డెబ్బయ్యో దశకంలో) ఆయన తన మకాం విశాఖపట్నానికి మార్చి, అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ఏకంగా నాలుగు సంవత్సరాలపాటు అధ్యయనం చేశాడు. తర్వాత కాలంలో మద్రాసు, హైదరాబాద్ పురావస్తు శాఖ అధీనంలోని అనేక పత్రాలను సంపాదించాడు. వేటపాలెం లాంటి ప్రదేశాల్లోని గ్రంథాలయాలను దర్శించి సమాచారాన్ని సేకరించాడు. ఆనాటి సీనియర్ కామ్రేడ్స్ దగ్గర నుండి, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చాలా సమాచారాన్ని సంపాదించాడు. వాటన్నిటి ఫలితం ప్రస్తుతం పాఠకుల ముందున్న “ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర” మొదటి సంపుటం.
పుస్తకం చదువుతుంటే తొలితరం కమ్యూనిస్టులు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, ఉద్యమ నిర్మాణంలో వారికి గల అకుంఠిత దీక్ష మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఉద్యమ పుట్టుక, పెరుగుదలను గురించి ఆయన తొలిపలుకుల్లోనే గొప్ప సారూప్యతతో రాశాడు. “తల్లి ఒడిలో పాలు తాగుతూ కేరింతలుకొట్టే బిడ్డ, నేలమీద కూర్చోడం, పాకడం, లేచి నిలబడటం, క్రింద పడటం, మళ్ళీ లేవటం, నడవటం, పరుగెత్తటం అన్నీ మనముందు కనిపిస్తాయ”ని కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభ దినాలను గురించి రాశాడు. ఆయన స్వయంగా పాల్గొని అశేష త్యాగం చేసి, అష్టకష్టాలు పడి ఉద్యమాన్ని నిర్మించిన మహానుభావుల్లో ఒకరు.
స్వాతంత్ర్య పోరాటకాలంలో సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని, ఆటుపోట్లు ఎదురైనా నిరాశా నిస్పృహలతో ఉన్న యువతరం కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఏ విధంగా మొగ్గుచూపారో ఆయన సోదాహరణంగా వివరించాడు. అలా వచ్చిన వారి వివరాలను, పుట్టుపూర్వోత్తరాలను సంగ్రహించి ఈ పుస్తకంలో పొందుపర్చాడు. ఆ స్ఫూర్తి ప్రదాతలు ఉద్యమ నిర్మాణానికై పడిన ఆరాటం, చేసిన పోరాటం పాఠకుల మనోనేత్రాన్ని తెరుస్తాయి. ఉత్కంఠతో, ఆశ్చర్యంతో, వేదనతో హృదయ కవాటాలు తెరువబడతాయి.
- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
కంభంవారిగారు తల కమ్యూనిస్టుల్లో ప్రథములని చెప్పాలి. చరిత్ర రచనలో ఆయన అందెవేసిన చేయి. మార్సిస్టు దృక్కోణాన్నుండి “ఆంధ్రప్రదేశ్ చరిత్ర - సంస్కృతి” అనే గ్రంథాన్ని రాశాడు. మార్క్సిస్టు దృక్కోణాన్నుండి సమగ్ర రచనగా వెలువడిన మొదటి గ్రంథం అదే కావచ్చు. పుస్తక రచనకు అవసరమైన సమాచార సేకరణ కోసం (డెబ్బయ్యో దశకంలో) ఆయన తన మకాం విశాఖపట్నానికి మార్చి, అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ఏకంగా నాలుగు సంవత్సరాలపాటు అధ్యయనం చేశాడు. తర్వాత కాలంలో మద్రాసు, హైదరాబాద్ పురావస్తు శాఖ అధీనంలోని అనేక పత్రాలను సంపాదించాడు. వేటపాలెం లాంటి ప్రదేశాల్లోని గ్రంథాలయాలను దర్శించి సమాచారాన్ని సేకరించాడు. ఆనాటి సీనియర్ కామ్రేడ్స్ దగ్గర నుండి, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చాలా సమాచారాన్ని సంపాదించాడు. వాటన్నిటి ఫలితం ప్రస్తుతం పాఠకుల ముందున్న “ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర” మొదటి సంపుటం. పుస్తకం చదువుతుంటే తొలితరం కమ్యూనిస్టులు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, ఉద్యమ నిర్మాణంలో వారికి గల అకుంఠిత దీక్ష మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఉద్యమ పుట్టుక, పెరుగుదలను గురించి ఆయన తొలిపలుకుల్లోనే గొప్ప సారూప్యతతో రాశాడు. “తల్లి ఒడిలో పాలు తాగుతూ కేరింతలుకొట్టే బిడ్డ, నేలమీద కూర్చోడం, పాకడం, లేచి నిలబడటం, క్రింద పడటం, మళ్ళీ లేవటం, నడవటం, పరుగెత్తటం అన్నీ మనముందు కనిపిస్తాయ”ని కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభ దినాలను గురించి రాశాడు. ఆయన స్వయంగా పాల్గొని అశేష త్యాగం చేసి, అష్టకష్టాలు పడి ఉద్యమాన్ని నిర్మించిన మహానుభావుల్లో ఒకరు. స్వాతంత్ర్య పోరాటకాలంలో సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని, ఆటుపోట్లు ఎదురైనా నిరాశా నిస్పృహలతో ఉన్న యువతరం కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఏ విధంగా మొగ్గుచూపారో ఆయన సోదాహరణంగా వివరించాడు. అలా వచ్చిన వారి వివరాలను, పుట్టుపూర్వోత్తరాలను సంగ్రహించి ఈ పుస్తకంలో పొందుపర్చాడు. ఆ స్ఫూర్తి ప్రదాతలు ఉద్యమ నిర్మాణానికై పడిన ఆరాటం, చేసిన పోరాటం పాఠకుల మనోనేత్రాన్ని తెరుస్తాయి. ఉత్కంఠతో, ఆశ్చర్యంతో, వేదనతో హృదయ కవాటాలు తెరువబడతాయి. - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్© 2017,www.logili.com All Rights Reserved.