అస్పృశ్యత - దాని మూలం
అస్పృశ్యుల దుర్భర పరిస్థితులకు చలించిపోయే వాళ్ళు “అస్పృశ్యుల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి" అని నినదించి తమ భారాన్ని దించుకోవడం మనం తరచూ వింటూ వుంటాం. ఈ సమస్యపై ఆసక్తి వున్న వాళ్ళు ఎవరైనా "స్పృశ్య హిందువులను మార్చడానికి ఏదో ఒకటి చేయాలి" అని అనడం మాత్రం మనకెక్కడా వినబడదు. మనం బాగు చేసుకోవలసినది అస్పృశ్యులనేనని మినహాయింపులు లేకుండా అందరి అభిప్రాయం. ఒక ఉద్యమమేదన్నా ఉంటే అది అస్పృశ్యుల గురించి మాత్రమేననీ, అస్పృశ్యులకు జబ్బు కుదిరిస్తే అస్పృశ్యత మాయమవుతుందనీ వాళ్ళ నమ్మకం. స్పృశ్య హిందువులు చేయవలసిందేమీ లేదు. వారి మనసుల్లో, ప్రవర్తనల్లో, నైతికతలో అన్నీ సవ్యంగా వున్నాయి. అతడు పరిపూర్ణుడు, అతనిలో ఏలోపమూ లేదు. ఈ అభిప్రాయం సరైనదేనా? సరైనదైనా. కాకపోయినా దీన్నే పట్టుకు వేళ్ళాడడానికి హిందువులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ అభిప్రాయంలో, అస్పృశ్యుల సమస్యకు తాము బాధ్యులం కామని తమను తాము సంతృప్తి పరచుకోవడానికి గొప్ప అవకాశం వుంది.
ఈ విధమైన ప్రవృత్తి ఎంత సహజమైనదో యూదుల (Jews) పట్ల యూదేతరుల (Gentle) దృక్పథాన్ని బట్టి వివరించుకోవచ్చు. హిందువుల మాదిరిగానే యూదేతరులు కూడా యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని అంగీకరించరు. ఇక్కడ లూయీ గౌల్డింగ్ పరిశీలనలు ఎంతో విలువయినవి. యూదుల సమస్య ఏ విధంగా అసలు యూదేతరుల సమస్యో చూపించడానికి ఆయన ఇలా అన్నారు :
"యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని చూపించే ఒక సామాన్య వుదాహరణను మీ ముందుచుతున్నాను. నా మిత్రుడు జాన్స్మిత్కి అత్యంత ప్రియమైన ఉత్తమజాతి ఐరిష్ కుక్క వుంది. దాని పేరు పాడీ. దీనికి స్కాచ్ కుక్కలంటే ఇష్టం ఉండదు. ఓ ఇరవై గజాల దూరం నుంచి ఒక స్కాచ్ కుక్క వెళ్తూందంటే చాలు ఈ పాడీ, చుట్టు పక్కల వాళ్ళ చెవులు గళ్ళు పడేలా మొరుగుతూ వాటిని అవమానకరంగా సవాలు చేసేది. ఇది జాన్స్మిత్కి ఇబ్బందిగా వుండి, దాన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు. పైగా పాడీ ఆగ్రహానికి గురైన కుక్కలు చాలావరకూ మెతక ప్రాణులు. చాలా అరుదుగా అరిచేవి. తనకు పాడీ మీద ఎంత ప్రేమ వున్నా స్మిత్.................
అస్పృశ్యత - దాని మూలం అస్పృశ్యుల దుర్భర పరిస్థితులకు చలించిపోయే వాళ్ళు “అస్పృశ్యుల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి" అని నినదించి తమ భారాన్ని దించుకోవడం మనం తరచూ వింటూ వుంటాం. ఈ సమస్యపై ఆసక్తి వున్న వాళ్ళు ఎవరైనా "స్పృశ్య హిందువులను మార్చడానికి ఏదో ఒకటి చేయాలి" అని అనడం మాత్రం మనకెక్కడా వినబడదు. మనం బాగు చేసుకోవలసినది అస్పృశ్యులనేనని మినహాయింపులు లేకుండా అందరి అభిప్రాయం. ఒక ఉద్యమమేదన్నా ఉంటే అది అస్పృశ్యుల గురించి మాత్రమేననీ, అస్పృశ్యులకు జబ్బు కుదిరిస్తే అస్పృశ్యత మాయమవుతుందనీ వాళ్ళ నమ్మకం. స్పృశ్య హిందువులు చేయవలసిందేమీ లేదు. వారి మనసుల్లో, ప్రవర్తనల్లో, నైతికతలో అన్నీ సవ్యంగా వున్నాయి. అతడు పరిపూర్ణుడు, అతనిలో ఏలోపమూ లేదు. ఈ అభిప్రాయం సరైనదేనా? సరైనదైనా. కాకపోయినా దీన్నే పట్టుకు వేళ్ళాడడానికి హిందువులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ అభిప్రాయంలో, అస్పృశ్యుల సమస్యకు తాము బాధ్యులం కామని తమను తాము సంతృప్తి పరచుకోవడానికి గొప్ప అవకాశం వుంది. ఈ విధమైన ప్రవృత్తి ఎంత సహజమైనదో యూదుల (Jews) పట్ల యూదేతరుల (Gentle) దృక్పథాన్ని బట్టి వివరించుకోవచ్చు. హిందువుల మాదిరిగానే యూదేతరులు కూడా యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని అంగీకరించరు. ఇక్కడ లూయీ గౌల్డింగ్ పరిశీలనలు ఎంతో విలువయినవి. యూదుల సమస్య ఏ విధంగా అసలు యూదేతరుల సమస్యో చూపించడానికి ఆయన ఇలా అన్నారు : "యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని చూపించే ఒక సామాన్య వుదాహరణను మీ ముందుచుతున్నాను. నా మిత్రుడు జాన్స్మిత్కి అత్యంత ప్రియమైన ఉత్తమజాతి ఐరిష్ కుక్క వుంది. దాని పేరు పాడీ. దీనికి స్కాచ్ కుక్కలంటే ఇష్టం ఉండదు. ఓ ఇరవై గజాల దూరం నుంచి ఒక స్కాచ్ కుక్క వెళ్తూందంటే చాలు ఈ పాడీ, చుట్టు పక్కల వాళ్ళ చెవులు గళ్ళు పడేలా మొరుగుతూ వాటిని అవమానకరంగా సవాలు చేసేది. ఇది జాన్స్మిత్కి ఇబ్బందిగా వుండి, దాన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు. పైగా పాడీ ఆగ్రహానికి గురైన కుక్కలు చాలావరకూ మెతక ప్రాణులు. చాలా అరుదుగా అరిచేవి. తనకు పాడీ మీద ఎంత ప్రేమ వున్నా స్మిత్.................© 2017,www.logili.com All Rights Reserved.