మానవ సమాజం భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందే క్రమంలో జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ కాలంలోనే యూరోపియన్ దేశాలు మతాన్ని రాజ్యం నుండి వేరు చేయటానికి పోరాటాలు కూడా నడిపాయి. భూస్వామ్య వ్యవస్థ పరాకాష్టకు చేరుకున్న సమయంలో వివిధ దేశాల్లో రాజులు, చక్రవర్తులు రాజే దైవాంశ సంభూతుడు అన్న భ్రమ వ్యాపింపచేయటం ద్వారా ప్రజలను గుప్పెట్లో పెట్టుకున్నారు కానీ భూస్వామ్య వ్యవస్థపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాధించిన విజయం ఈ భావనకు స్వస్తి చెప్పటంతో పాటు రాజ్యానికి, మతానికి మధ్య పెనవేసుకుని ఉన్న బంధాన్ని వేరు చేసింది. మతంతో సంబంధం లేని అస్తిత్వాన్ని రాజ్యానికి తెచ్చిపెట్టింది పెట్టుబడిదారీ వ్యవస్థ. 1648లో వెస్ట్ ఫాలియాలో జరిగిన సంధితో రాజ్యాల సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి. దీని పర్యవసానమే వివిధ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను సమన్వయం చేసేందుకు ఉనికిలోకి వచ్చిన అంతర్జాతీయ న్యాయసూత్రాలు. చట్టాలు. వ్యవస్థలు.................
భారతీయత అంటే... భారతీయత - నేపథ్యం మానవ సమాజం భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందే క్రమంలో జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ కాలంలోనే యూరోపియన్ దేశాలు మతాన్ని రాజ్యం నుండి వేరు చేయటానికి పోరాటాలు కూడా నడిపాయి. భూస్వామ్య వ్యవస్థ పరాకాష్టకు చేరుకున్న సమయంలో వివిధ దేశాల్లో రాజులు, చక్రవర్తులు రాజే దైవాంశ సంభూతుడు అన్న భ్రమ వ్యాపింపచేయటం ద్వారా ప్రజలను గుప్పెట్లో పెట్టుకున్నారు కానీ భూస్వామ్య వ్యవస్థపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాధించిన విజయం ఈ భావనకు స్వస్తి చెప్పటంతో పాటు రాజ్యానికి, మతానికి మధ్య పెనవేసుకుని ఉన్న బంధాన్ని వేరు చేసింది. మతంతో సంబంధం లేని అస్తిత్వాన్ని రాజ్యానికి తెచ్చిపెట్టింది పెట్టుబడిదారీ వ్యవస్థ. 1648లో వెస్ట్ ఫాలియాలో జరిగిన సంధితో రాజ్యాల సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి. దీని పర్యవసానమే వివిధ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను సమన్వయం చేసేందుకు ఉనికిలోకి వచ్చిన అంతర్జాతీయ న్యాయసూత్రాలు. చట్టాలు. వ్యవస్థలు.................© 2017,www.logili.com All Rights Reserved.