సంఘటితం కావాలని, తెగ పెద్ద ఆజ్ఞలు పాటించాలని, ఏదో మేర క్రమశిక్షణ పాటించాలన్న ఆలోచన మానవ సమూహాలకు వచ్చినప్పుడే వ్యత్యాసాలకు, తేడాలకు, అంతిమంగా 'దోపిడీ' స్వభావానికి భీజం పడింది. అంతేగాని రాచరికం రోజుల్లోనో, ఫ్యూడల్ వ్యవస్థలోనో, పారిశ్రామిక యుగంలోనో ఆర్ధిక వ్యత్యాసాలకు, తేడాలు, వర్గాలు కొత్తవి కావు. మానవ సమూహాల ప్రాథమిక దశ నుంచే వీటిని పిండరూపంలో తిలకించవచ్చు.
ద్యైతాన్ని(కమ్యూనిజం - క్యాప్టలిజం) తలకెక్కించుకున్న తూర్పు జర్మనీ లేపిన అడ్డుగోడ (బెర్లిన్ వాల్) ఎంతో కాలం నిలువలేదు. పాతికేళ్ళ క్రితమే అక్కడి ప్రజలు దాన్ని కసి కొద్ది కూల్చేసారు. ఉభయ జర్మనీలు (ద్వైతం) లేవు, ఉన్నది ఒక జర్మనీయేనని / అద్వైతమేనని అక్కడి ప్రజలు చాటిచెప్పారు. అనంతరం ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. ప్రజలు ఆధునిక అద్వైతాన్నే కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలి?... ఇదే ఈ పుస్తకంలో తెలుపబడింది.
సంఘటితం కావాలని, తెగ పెద్ద ఆజ్ఞలు పాటించాలని, ఏదో మేర క్రమశిక్షణ పాటించాలన్న ఆలోచన మానవ సమూహాలకు వచ్చినప్పుడే వ్యత్యాసాలకు, తేడాలకు, అంతిమంగా 'దోపిడీ' స్వభావానికి భీజం పడింది. అంతేగాని రాచరికం రోజుల్లోనో, ఫ్యూడల్ వ్యవస్థలోనో, పారిశ్రామిక యుగంలోనో ఆర్ధిక వ్యత్యాసాలకు, తేడాలు, వర్గాలు కొత్తవి కావు. మానవ సమూహాల ప్రాథమిక దశ నుంచే వీటిని పిండరూపంలో తిలకించవచ్చు. ద్యైతాన్ని(కమ్యూనిజం - క్యాప్టలిజం) తలకెక్కించుకున్న తూర్పు జర్మనీ లేపిన అడ్డుగోడ (బెర్లిన్ వాల్) ఎంతో కాలం నిలువలేదు. పాతికేళ్ళ క్రితమే అక్కడి ప్రజలు దాన్ని కసి కొద్ది కూల్చేసారు. ఉభయ జర్మనీలు (ద్వైతం) లేవు, ఉన్నది ఒక జర్మనీయేనని / అద్వైతమేనని అక్కడి ప్రజలు చాటిచెప్పారు. అనంతరం ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. ప్రజలు ఆధునిక అద్వైతాన్నే కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలి?... ఇదే ఈ పుస్తకంలో తెలుపబడింది.© 2017,www.logili.com All Rights Reserved.