మావోయిస్టులు, వారి సానుభూతిపరులు చెబుతున్నట్లు... మన ప్రజాస్వామ్యం బూటకం కావచ్చు. ఓటు వేయటం, అరవాటం తప్ప మనలో అత్యధికులకు ఏమి చేతగాకాపోవచ్చు . కానీ మనకు రహస్య పద్దతిలో స్వేచ్ఛగా ఓటువేసే హక్కు ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. వీటికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా , ఎన్నికల్లో శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతోంది. ఎన్నో భాషలు, సంస్కృతులు, ఎంతో సంక్లిష్ట భిన్నత్వం మధ్య ఒకేదేశంగా మనం కలిసి ఉంటూ ఈ ప్రస్వామిక సంస్కృతిని పెంపొందించు కోగలిగాం. ఇదేమి తక్కువ విషయం కాదు. ఎన్ని లోపాలున్నా... ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు వేరే మార్గం లేదు. ఇందుకు పంథా....... రాజ్యాంగం తప్ప హింస కాదు. ఆధునిక యుగంలో రాజ్యవ్యవస్థతో హింసాత్మకంగా తలపడటం ఉనికిని చాటు కోవడానికి పనికొస్తుందేమోగాని, విజయానికి పనికి రాదు.