ఈ కథలన్నీ ఒక ఎత్తు, భాషాపరంగా ఈ కథల గొప్పదనం మరో ఎత్తు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మాండలికంతో వచ్చిన ఏకైక గ్రంథంగా దీని ప్రత్యేకత. గ్రామీణ ప్రజల వ్యవహారికంలో ఉండే అనేక మాండలిక పదాలు అత్యంత సహజంగా ఈ కథల్లో ఒదిగిపోయాయి. "గదవ, బుడాలు, చెప్టీ, పలగార, మల్దోటి కూర" లాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. "మానేసరు బుడ్డి, గురిగి, సట్టి, పుల్చేరి పండ్లు, బుడ్డగోశి పండ్లు" మారిన పరిస్థితుల్లో ఇప్పుడు గుర్తించడం కష్టమే అయినప్పటికీ, వాటిని తెలియజేసిన విధానం బాగుంది. ముఖ్యంగా "తిరగబడ్డ భూమి" కథలో మొదటి పేరాగా వచ్చిన కావలి ముత్యాలు స్వగతం, "సాపలు" కథలో ముత్తవ్వ తన గోసను వేల్లబోసుకునే ఘట్టం - మాండలిక భాషా సౌందర్యానికి ఉదాహరణలుగా నిలిచిపోతాయి. మంచి పఠనీయతా గుణం కలిగిన ఈ మాండలిక కథలను ఏ ప్రాంతం వారైనా చదివి ఆనందించవచ్చు.
ఈ కథలన్నీ ఒక ఎత్తు, భాషాపరంగా ఈ కథల గొప్పదనం మరో ఎత్తు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మాండలికంతో వచ్చిన ఏకైక గ్రంథంగా దీని ప్రత్యేకత. గ్రామీణ ప్రజల వ్యవహారికంలో ఉండే అనేక మాండలిక పదాలు అత్యంత సహజంగా ఈ కథల్లో ఒదిగిపోయాయి. "గదవ, బుడాలు, చెప్టీ, పలగార, మల్దోటి కూర" లాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. "మానేసరు బుడ్డి, గురిగి, సట్టి, పుల్చేరి పండ్లు, బుడ్డగోశి పండ్లు" మారిన పరిస్థితుల్లో ఇప్పుడు గుర్తించడం కష్టమే అయినప్పటికీ, వాటిని తెలియజేసిన విధానం బాగుంది. ముఖ్యంగా "తిరగబడ్డ భూమి" కథలో మొదటి పేరాగా వచ్చిన కావలి ముత్యాలు స్వగతం, "సాపలు" కథలో ముత్తవ్వ తన గోసను వేల్లబోసుకునే ఘట్టం - మాండలిక భాషా సౌందర్యానికి ఉదాహరణలుగా నిలిచిపోతాయి. మంచి పఠనీయతా గుణం కలిగిన ఈ మాండలిక కథలను ఏ ప్రాంతం వారైనా చదివి ఆనందించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.