అనువాదం అనేది ఒక కళ. అంతేకాదు, అది ఒక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే అదొక కళాత్మక శాస్త్రం. శాస్త్రీయమైన కళ. మరి అనువాదంలో ఏముంటుంది? మూలంలో ఉన్న వస్తువు లక్ష్యభాషా పాఠకులకు అర్థమయ్యే విధంగా అనువాదంలో ఒదిగిపోతుంది. ఇంతకీ మూలభాషలోని వస్తువూ, ద్రవ్యమూ ఎక్కడినుంచి వస్తాయి? ప్రాచీనకాలంలోనైతే దేవుళ్ళూ, దేవతలూ, దయ్యాలూ, పురాణపురుషులూ మొదలైనవాళ్ళు కథావస్తువులుగా, కావ్యవస్తువులుగా ఉండేవాళ్ళు.
ఆధునిక యుగంలో వస్తువు మారిపోయింది. దేవుళ్ళూ దయ్యాల నుండి మనిషినీ, సమాజాన్నీ, చరిత్రనూ, జీవితాన్నే కేంద్రంగా చేసుకొని వస్తువు మార్పుకు గురైంది. ఈ 'గోలకొండ పత్రిక' అనువాద కథల్లోనూ అందుకే మానవుడు కనిపిస్తాడు. విచిత్రమైన మానవ మనస్తత్వం గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చారిత్రిక సంఘటనలకు కథారూపాలు అగుపిస్తాయి. ఈ సమాహారంలో మొత్తం ఇరవై ఆరు కథలున్నాయి. ఇందులో యం యస్ వీరయ్యవి ఆరు కథలున్నాయి. అందులో రెండిటికి మాత్రమే మూలాలు చూపించినా, ఆరూ అనువాద కథలుగానే భావించాల్సి ఉంటుంది.
అనువాదం అనేది ఒక కళ. అంతేకాదు, అది ఒక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే అదొక కళాత్మక శాస్త్రం. శాస్త్రీయమైన కళ. మరి అనువాదంలో ఏముంటుంది? మూలంలో ఉన్న వస్తువు లక్ష్యభాషా పాఠకులకు అర్థమయ్యే విధంగా అనువాదంలో ఒదిగిపోతుంది. ఇంతకీ మూలభాషలోని వస్తువూ, ద్రవ్యమూ ఎక్కడినుంచి వస్తాయి? ప్రాచీనకాలంలోనైతే దేవుళ్ళూ, దేవతలూ, దయ్యాలూ, పురాణపురుషులూ మొదలైనవాళ్ళు కథావస్తువులుగా, కావ్యవస్తువులుగా ఉండేవాళ్ళు. ఆధునిక యుగంలో వస్తువు మారిపోయింది. దేవుళ్ళూ దయ్యాల నుండి మనిషినీ, సమాజాన్నీ, చరిత్రనూ, జీవితాన్నే కేంద్రంగా చేసుకొని వస్తువు మార్పుకు గురైంది. ఈ 'గోలకొండ పత్రిక' అనువాద కథల్లోనూ అందుకే మానవుడు కనిపిస్తాడు. విచిత్రమైన మానవ మనస్తత్వం గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చారిత్రిక సంఘటనలకు కథారూపాలు అగుపిస్తాయి. ఈ సమాహారంలో మొత్తం ఇరవై ఆరు కథలున్నాయి. ఇందులో యం యస్ వీరయ్యవి ఆరు కథలున్నాయి. అందులో రెండిటికి మాత్రమే మూలాలు చూపించినా, ఆరూ అనువాద కథలుగానే భావించాల్సి ఉంటుంది.
© 2017,www.logili.com All Rights Reserved.