అందరు రాసేవాళ్లే అయితే రాసేవాళ్లే పరంపరను మోసేవాళ్లెవరూ ? ఇదుగో, ఆ మోసే పనికి పూనుకొన్నాడు పెనుగొండ లక్ష్మీనారాయణ. వెయ్యటం అంటే తరతరాల సాహిత్య చరిత్రను తవ్వి తలకెత్తటమే .
రచయితలు విడివిడిగా రాస్తారు .విడి విడిగానే సామాజానికి ఎదో చెపుతారు. ఆ విడి విడి రచనల్లో సమన, సామూహిక స్వభావమేదో ఉంటుంది. దాన్ని గుర్తించినప్పుడే మొత్తం మీద ఒక తరం సాహిత్యానికి సమాజానికి ఉన్న అంతర్గత సంబంధం ఏమిటో తద్వారా ఆ సమాజానికి కలిగిన మేలేమిటో మనకు తెలుస్తుంది. సాహిత్యకారులు గాక సాహిత్య చరిత్ర కారులే ఈ పని చేయగలుగుతారు.
గుంటూరు సీమా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది క్రి. శ. 13 వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికి అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామజిక చరిత్రలో అంతర్భాగం. దాని క్రమానుగత పరిమాణాన్ని , గీతశిలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూర్ణత కలుగుతుంది.