తిలక్ సాహిత్యం పై ప్రముఖ కవులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ "తిలక్ సాహితీ సందర్శనం". అంతేకాదు సాహిత్యం గురించి తిలక్ గారు రాసిన కొన్ని వ్యాసాలు, లేఖలు, వారిచ్చిన ఇంటర్వ్యూ కూడా అనుబంధంలో చేరాయి. సాహితీవేత్తలు రాసిన కొన్ని వ్యాసాల్లో అధిక భాగం తిలక్ మరణించినప్పుడు, ఆ తరువాత ప్రచురితమైన స్మృతి సంచికల నుండి సేకరించినవి. అలాగే తిలక్ గారి తొలి కావ్యం "ప్రభాతము, సంధ్య", "అమృతం కురిసిన రాత్రి" కవితా సంపుటికి, "గోరువంకలు" పద్య కావ్య సంపుటికి రాసిన ముందుమాటలు, వాటిపై వచ్చిన సమీక్షలు, విశాలాంధ్ర ప్రచురాణాలయం నాటి సంపాదకులు నిడమర్తి ఉమారాజేశ్వరరావు గారి తిలక్ కథల పరిచయ వ్యాసం, కథలపై వచ్చిన సమీక్ష వ్యాసాలు ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి.

© 2017,www.logili.com All Rights Reserved.