2019 డిసెంబర్ రెండో వారంలో దేశం కొత్త అణచివేతలోకీ, కొత్త ప్రతిఘటనలోకీ ప్రవేశించింది. తరతరాలుగా ఈ దేశంలో మనుగడ సాగిస్తున్న ప్రజాసమూహాలు తమ పురసత్వాన్ని రుజువు చేసుకోవాలనే కఠిన నిబంధనల దమననీతి ప్రారంభమైంది. ఈ అక్రమ, అమానుష, కుటిల దమననీతిని సహించబోమని యువతరం, మహిళలు, మైనారిటీలు, ఎలుగెత్తి నిలిచారు. ఈ కొత్త ప్రతిఘటనా ప్రయాణంలో మొదటి అడుగు వేసిన వాళ్లు, సంఘ్ పరివార్ దుర్మార్గాన్ని సవాల్ చేసే కొత్త మార్గాన్ని దేశానికి పరిచయం చేసిన వాళ్లు విద్యార్థులు, అందువల్ల వాళ్లు మరింత నిర్బంధాన్ని, హింసాకాండను అనుభవించవలసి వచ్చింది గాని, వాళ్ల అప్రతిహత పోరాటాలు, మొక్కవోని దీక్ష దేశానికే ఒక వెలుగుదివ్వెగా నిలిచాయి. అటువంటి వినూత్న దీపధారుల్లో మొట్టమొదట చెప్పవలసిన పేర్లు జామియా మిలియా ఇస్లామియా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులవి. ఆ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పోరాట స్ఫూర్తికీ, ప్రతిఘటనా పటిమకూ అద్దం పెట్టె వ్యాసాల, నివేదికల సంకలనం ఇది.
- ఎన్. వేణుగోపాల్