'అశోకుడు - మౌర్యవంశ క్షీణత' గ్రంథాన్ని డా రొమిల్లా థాపర్ రచించారు. వీరు డిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్రశాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో వీరు ప్రథమ శ్రేణిలో ఉన్నారు. జె ఎన్ యు లో ఎమిరిటస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. క్రీ పూ 3, 4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్రచరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాజ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావం వల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ఏఏ మార్పులు జరిగాయో ఈ గ్రంథం విశ్లేషించింది. ప్రాచీన భారతదేశం తదనంతర పరిణామాలకు గల సంబంధాలను ఈ గ్రంథం కొత్త కోణంలో వ్యాఖ్యానించింది.
'అశోకుడు - మౌర్యవంశ క్షీణత' గ్రంథాన్ని డా రొమిల్లా థాపర్ రచించారు. వీరు డిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్రశాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో వీరు ప్రథమ శ్రేణిలో ఉన్నారు. జె ఎన్ యు లో ఎమిరిటస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. క్రీ పూ 3, 4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్రచరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాజ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావం వల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ఏఏ మార్పులు జరిగాయో ఈ గ్రంథం విశ్లేషించింది. ప్రాచీన భారతదేశం తదనంతర పరిణామాలకు గల సంబంధాలను ఈ గ్రంథం కొత్త కోణంలో వ్యాఖ్యానించింది.© 2017,www.logili.com All Rights Reserved.