భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటివరకు ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే అరుదైన రచన ఇది. సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే మానవ పరిణామం, చరిత్ర, అర్ధిక వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటిని పరామర్శించడం అవసరం. అందుకే అసలు సామాజిక పరిణామాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పద్దతులను స్థూలంగా పరిచయం చేస్తూ - ఆర్యులు, ద్రావిడులు వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో మానవ సంచారమే లేదన్నట్లుగా మూలవాసుల ఉనికినే చరిత్ర పరిధిలోకి రాకుండా చూసిన చారిత్రక ఆహేతుకతనూ, ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టి పెరిగిన కులమతాల అర్ధిక, తాత్విక పునాదుల్ని, క్రోని క్యాపిటలిజం వంటి సమకాలీన సామాజిక సమస్యలకున్న అర్ధిక మూలాల్ని శాస్త్రీయంగా చర్చించిందీ రచన. సమాజ పరిణామాల్ని అధ్యయనం చేసేందుకు మనిషి నిర్మించుకున్న తాత్విక ఆలోచనలను, సత్యాన్వేషణ కోసం జరుగుతున్న నిరంతర కృషిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు రచయిత ప్రొ. కే. ఎస్. చలం.
భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటివరకు ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే అరుదైన రచన ఇది. సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే మానవ పరిణామం, చరిత్ర, అర్ధిక వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటిని పరామర్శించడం అవసరం. అందుకే అసలు సామాజిక పరిణామాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పద్దతులను స్థూలంగా పరిచయం చేస్తూ - ఆర్యులు, ద్రావిడులు వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో మానవ సంచారమే లేదన్నట్లుగా మూలవాసుల ఉనికినే చరిత్ర పరిధిలోకి రాకుండా చూసిన చారిత్రక ఆహేతుకతనూ, ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టి పెరిగిన కులమతాల అర్ధిక, తాత్విక పునాదుల్ని, క్రోని క్యాపిటలిజం వంటి సమకాలీన సామాజిక సమస్యలకున్న అర్ధిక మూలాల్ని శాస్త్రీయంగా చర్చించిందీ రచన. సమాజ పరిణామాల్ని అధ్యయనం చేసేందుకు మనిషి నిర్మించుకున్న తాత్విక ఆలోచనలను, సత్యాన్వేషణ కోసం జరుగుతున్న నిరంతర కృషిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు రచయిత ప్రొ. కే. ఎస్. చలం.© 2017,www.logili.com All Rights Reserved.