ప్రచురణకర్తల మాట
అలెగ్జాండ్రా కొల్లంతాయ్ (31, మార్చి 1872 - 9, మార్చి 1952) ఒక కమ్యూనిస్టు విప్లవకారిణి. ఆధునిక రాజ్యాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలలో భాగస్వామి అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ. ఆమె బోల్షివిక్ పార్టీలో కార్మిక ప్రతిపక్షాన్ని నిర్వహించారు. ప్రేమ, లైంగిక సంబంధాలపై ఆమె ఒక సిద్ధాంతవేత్త. ఆమె దౌత్యవేత్త కూడ.
అలెగ్జాండ్రా కొల్లంతాయ్ ఒక సంక్లిష్ట వారసత్వాన్ని విడిచి వెళ్ళారు. నిబద్ధతతో కూడిన ఆమె రాజకీయ కార్యాచరణ, సైద్ధాంతిక కృషి ఇప్పటికీ చాలమందికి అపరిచితం. మార్క్సిజంతో నేరుగా పరిచయం లేని ఫెమినిస్టు వర్గాలకు ఆమె పేరు కూడ తెలియదు. కాని ఆమె రచనలు, ప్రత్యేకించి రష్యన్ విప్లవ తొలి సంవత్సరాలలో రాసినవి, జెండర్, వర్గం మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గదర్శిగా పనిచేస్తాయి. నూతన ఆలోచనలను ఆవిష్కరింపచేస్తాయి. అవి ఎంతో ఆధునికమైనవిగాను, కచ్చితమైనవిగాను ఉండి నేటికీ వర్తించేవిగా ఉంటాయి.
వామపక్ష ప్రచురణ సంస్థల అంతర్జాతీయ సంస్థ (ఐయుఎల్‌పి) ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఒకే పుస్తకాన్ని పలు భాషలో వివిధ దేశాల ప్రచురణ సంస్థలు ఏక సమయంలో ప్రచురిస్తున్న మాదిరిగా ఈ సంవత్సరం కొల్లంతాయ్ 150 జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం వెలువడుతున్నది. ప్రపంచ వ్యాపితంగా 25 ప్రచురణ సంస్థలు 20కి పైగా భాషల్లో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాయి. దీనిలో కొల్లంతాయ్ రచనలు నాలుగు ఉన్నాయి. ఆమె రచనల.............
ప్రచురణకర్తల మాట అలెగ్జాండ్రా కొల్లంతాయ్ (31, మార్చి 1872 - 9, మార్చి 1952) ఒక కమ్యూనిస్టు విప్లవకారిణి. ఆధునిక రాజ్యాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలలో భాగస్వామి అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ. ఆమె బోల్షివిక్ పార్టీలో కార్మిక ప్రతిపక్షాన్ని నిర్వహించారు. ప్రేమ, లైంగిక సంబంధాలపై ఆమె ఒక సిద్ధాంతవేత్త. ఆమె దౌత్యవేత్త కూడ. అలెగ్జాండ్రా కొల్లంతాయ్ ఒక సంక్లిష్ట వారసత్వాన్ని విడిచి వెళ్ళారు. నిబద్ధతతో కూడిన ఆమె రాజకీయ కార్యాచరణ, సైద్ధాంతిక కృషి ఇప్పటికీ చాలమందికి అపరిచితం. మార్క్సిజంతో నేరుగా పరిచయం లేని ఫెమినిస్టు వర్గాలకు ఆమె పేరు కూడ తెలియదు. కాని ఆమె రచనలు, ప్రత్యేకించి రష్యన్ విప్లవ తొలి సంవత్సరాలలో రాసినవి, జెండర్, వర్గం మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గదర్శిగా పనిచేస్తాయి. నూతన ఆలోచనలను ఆవిష్కరింపచేస్తాయి. అవి ఎంతో ఆధునికమైనవిగాను, కచ్చితమైనవిగాను ఉండి నేటికీ వర్తించేవిగా ఉంటాయి. వామపక్ష ప్రచురణ సంస్థల అంతర్జాతీయ సంస్థ (ఐయుఎల్‌పి) ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఒకే పుస్తకాన్ని పలు భాషలో వివిధ దేశాల ప్రచురణ సంస్థలు ఏక సమయంలో ప్రచురిస్తున్న మాదిరిగా ఈ సంవత్సరం కొల్లంతాయ్ 150 జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం వెలువడుతున్నది. ప్రపంచ వ్యాపితంగా 25 ప్రచురణ సంస్థలు 20కి పైగా భాషల్లో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాయి. దీనిలో కొల్లంతాయ్ రచనలు నాలుగు ఉన్నాయి. ఆమె రచనల.............© 2017,www.logili.com All Rights Reserved.