'పునాది రాళ్ళ' ను 'స్వయంకృషి' తో పేర్చి 'ఇంద్ర' ప్రస్థానాన్ని నిర్మించుకొని మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. అభిమానుల ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన 'ఖైదీ నంబర్ 150' చిత్రం ఘన విజయం సాధించి మరెన్నో చిత్రాల్లో నటించాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకుంటూ.. మా చిరకాల మిత్రులైన పసుపులేటి రామారావు గారు ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నాను.
- చందు రమేష్
'మెగా చిరంజీవితం 150' అన్న ఈ పుస్తకాన్ని నేనొక గ్రంథంగా భావిస్తాను. ఒక మామూలు పుస్తకం వేరుగా ఉంటుంది. గ్రంథమనేది మరో విధంగా ఉంటుంది. గ్రాంధిక భాషవంటి మహాగ్రంథ లక్షణాలు ఈ పుస్తకంలో ఉండవు. కానీ ఇది ఒక అసాధారణ వ్యక్తి యొక్క ఒక శ్రమజీవి యొక్క, ఒక స్వయంకృషీవలుని యొక్క చరిత్ర. అందుకే దీనిని ఒక ఉద్గ్రంథంగా భావిస్తున్నాను. అసామాన్యులకు మాత్రమే జీవిత చరిత్రలుంటాయి. చిరంజీవి వంటి శ్రమజీవి, సినీ కార్మికుడ్ని నా 43 ఏళ్ల సినీజీవితంలో మొదటిసారి మాత్రమే చూశాను. అలాగే మా మొదటి కలయిక మద్రాసు, ఆంధ్రాక్లబ్ క్యాంటీన్ లో జరిగింది. అప్పుడాయన, నేను విశాలాంధ్రలో రాసిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించి అభినందించారు.
ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ నలభై మూడేళ్ళ కిందట పలకరింపు, ఆత్మీయతలే ఆయనలో నాకు కనిపిస్తాయి. ఆయన చుట్టూ వంద మంది ఉన్నా ఒకవేళ అప్పుడు నేను అక్కడ ఉంటే 'ఏమిటి రామారావు ఎలా ఉన్నావ్?' అంటూ పలకరిస్తారు. అందుకే ఆయనంటే అభిమానం. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. 43 ఏళ్ల స్నేహాన్ని చవిచూస్తున్నది ఆయనలో మాత్రమే. నా సుదీర్ఘమైన సినీ జీవితంలో ఒక తీపిగుర్తు ఆయన. చాలామందికి తెలియని చిరంజీవి నాకు బాగా తెలుసు. చిరంజీవి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో కలవు.
- పసుపులేటి రామారావు
'పునాది రాళ్ళ' ను 'స్వయంకృషి' తో పేర్చి 'ఇంద్ర' ప్రస్థానాన్ని నిర్మించుకొని మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. అభిమానుల ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన 'ఖైదీ నంబర్ 150' చిత్రం ఘన విజయం సాధించి మరెన్నో చిత్రాల్లో నటించాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకుంటూ.. మా చిరకాల మిత్రులైన పసుపులేటి రామారావు గారు ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నాను. - చందు రమేష్ 'మెగా చిరంజీవితం 150' అన్న ఈ పుస్తకాన్ని నేనొక గ్రంథంగా భావిస్తాను. ఒక మామూలు పుస్తకం వేరుగా ఉంటుంది. గ్రంథమనేది మరో విధంగా ఉంటుంది. గ్రాంధిక భాషవంటి మహాగ్రంథ లక్షణాలు ఈ పుస్తకంలో ఉండవు. కానీ ఇది ఒక అసాధారణ వ్యక్తి యొక్క ఒక శ్రమజీవి యొక్క, ఒక స్వయంకృషీవలుని యొక్క చరిత్ర. అందుకే దీనిని ఒక ఉద్గ్రంథంగా భావిస్తున్నాను. అసామాన్యులకు మాత్రమే జీవిత చరిత్రలుంటాయి. చిరంజీవి వంటి శ్రమజీవి, సినీ కార్మికుడ్ని నా 43 ఏళ్ల సినీజీవితంలో మొదటిసారి మాత్రమే చూశాను. అలాగే మా మొదటి కలయిక మద్రాసు, ఆంధ్రాక్లబ్ క్యాంటీన్ లో జరిగింది. అప్పుడాయన, నేను విశాలాంధ్రలో రాసిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించి అభినందించారు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ నలభై మూడేళ్ళ కిందట పలకరింపు, ఆత్మీయతలే ఆయనలో నాకు కనిపిస్తాయి. ఆయన చుట్టూ వంద మంది ఉన్నా ఒకవేళ అప్పుడు నేను అక్కడ ఉంటే 'ఏమిటి రామారావు ఎలా ఉన్నావ్?' అంటూ పలకరిస్తారు. అందుకే ఆయనంటే అభిమానం. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. 43 ఏళ్ల స్నేహాన్ని చవిచూస్తున్నది ఆయనలో మాత్రమే. నా సుదీర్ఘమైన సినీ జీవితంలో ఒక తీపిగుర్తు ఆయన. చాలామందికి తెలియని చిరంజీవి నాకు బాగా తెలుసు. చిరంజీవి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో కలవు. - పసుపులేటి రామారావు© 2017,www.logili.com All Rights Reserved.