నల్లని పువ్వు ఇది చారిత్రిక నవల కాదు. కానీ హాలాండ్ దేశపు చరిత్రతో, రాజకీయాలతో సంబంధం ఉన్న కథ. నిజానికి ఇది ఒక సిసలయిన ప్రేమగాథ. రాజకీయ హత్యలతో మొదలయ్యే ఈ రచన చూస్తుండగానే పువ్వులు, ప్రేమమీదికి మారుతుంది. పూల పెంపకం ఆధారంగా చివరివరకు సాగే ఈ రచన పాఠకులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ ప్రేమ కథ సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. మొదట్లో నిజానికి అంత ఆసక్తికరంగా తోచని నవల, చూస్తుండగానే పాఠకులను పట్టేసి చదివిస్తుంది. మొదలుపెట్టిన తరువాత కిందపెట్టడానికి లేని రచనలు అని అర్థం వచ్చే మాట ఒకటి ఇంగ్లీషులో ఉంది. ఈ నవల అన్ని రకాలుగా ఆ పద్ధతిలోనే సాగుతుంది.
నవలకు ప్రేరణ ఒక రాజకుమారుని నుంచి వచ్చిందంటారు. ఇంతకూ ఈ కథ ఫ్రాన్స్ లో కాక, శత్రుదేశమయిన హాలాండ్ లో జరుగుతుందని మనం గమనించాలి. సస్పెన్స్ త్రిల్లర్ పధ్ధతితోబాటు ప్రేమ వ్యవహారం కూడా ఉన్న ఈ నవల చాలా పేరు సంపాదించుకున్నది. ఇందులో రచయిత కథ సాగించిన తీరు గురించి ఎంతయినా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాన్ని తెలుగులో చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అనువాదంతో కలకాలంగా నాకున్న కోరిక కూడా తీరింది. పాఠక మిత్రులకు ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
- కె బి గోపాలం
నల్లని పువ్వు ఇది చారిత్రిక నవల కాదు. కానీ హాలాండ్ దేశపు చరిత్రతో, రాజకీయాలతో సంబంధం ఉన్న కథ. నిజానికి ఇది ఒక సిసలయిన ప్రేమగాథ. రాజకీయ హత్యలతో మొదలయ్యే ఈ రచన చూస్తుండగానే పువ్వులు, ప్రేమమీదికి మారుతుంది. పూల పెంపకం ఆధారంగా చివరివరకు సాగే ఈ రచన పాఠకులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ ప్రేమ కథ సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. మొదట్లో నిజానికి అంత ఆసక్తికరంగా తోచని నవల, చూస్తుండగానే పాఠకులను పట్టేసి చదివిస్తుంది. మొదలుపెట్టిన తరువాత కిందపెట్టడానికి లేని రచనలు అని అర్థం వచ్చే మాట ఒకటి ఇంగ్లీషులో ఉంది. ఈ నవల అన్ని రకాలుగా ఆ పద్ధతిలోనే సాగుతుంది. నవలకు ప్రేరణ ఒక రాజకుమారుని నుంచి వచ్చిందంటారు. ఇంతకూ ఈ కథ ఫ్రాన్స్ లో కాక, శత్రుదేశమయిన హాలాండ్ లో జరుగుతుందని మనం గమనించాలి. సస్పెన్స్ త్రిల్లర్ పధ్ధతితోబాటు ప్రేమ వ్యవహారం కూడా ఉన్న ఈ నవల చాలా పేరు సంపాదించుకున్నది. ఇందులో రచయిత కథ సాగించిన తీరు గురించి ఎంతయినా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాన్ని తెలుగులో చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అనువాదంతో కలకాలంగా నాకున్న కోరిక కూడా తీరింది. పాఠక మిత్రులకు ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. - కె బి గోపాలం© 2017,www.logili.com All Rights Reserved.