Title | Price | |
Kondapalli Charitra | Rs.20 | In Stock |
కొండపల్లి చరిత్ర
కొండపల్లి కృష్ణాజిల్లాలో చేరిన బెజవాడ తాలూకా యందలి దుర్గారణ్య స్థలము. ఇది గొప్ప పర్వతము. దక్షిణం కృష్ణానది వరకును, ఉత్తరం కొండూరు, జుజ్జూరు వరకును వ్యాపించినది. దీని చుట్టు కొలత 100 మైళ్ళు. యీ పర్వతరాజమున ప్రతి సంవత్సరము శీతాఫలములు, కుంకుళ్లు, రేగుపండ్లు మొదలగునవి ఫలించును. కంప, కట్టె, పచ్చిక వగైరాలమీద ప్రభుత్వము వారికి సుమారు 15,000 రూపాయిలు ఆదాయము వచ్చుచుండును. ఈ కొండ పైన చిరుతపులులు, పెద్దపులులు మొదలగు క్రూరమృగముల భయమున్ను అప్పుడప్పుడు చోరభయమున్ను యుండును. కొండయెత్తు సుమారు 2 మైళ్ళు గలదు.
కొండపల్లిలో బొమ్మలు రకరకములుగా అనాది నుంచి తయారు చేయుచున్న ఆర్య క్షత్రియ కుటుంబములు సుమారు 50 గలవు. వీరి శిల్ప చాతుర్యము వర్ణనాతీతము. అనాది నుండి యీ గ్రామము చేతి పరిశ్రమలకు నిలయమే. చాల కాలము కొండపల్లి కాగిత పరిశ్రమకు ఆధిక్యము కలిగి వాడుకలో ఉండెడిది. ఆ కాగితపు పరిశ్రమ యిప్పుడు కానరాదు. ప్రస్తుత మీ గ్రామమందు ఒక మాధ్యమిక పాఠశాలయు, కీ.శే. బొల్లారెడ్డి కోటిరెడ్డి జమిందారుగారి ధర్మసత్రమును, గుంటక నర్సారెడ్డిగారిచే నిర్మింపబడిన కోటిరెడ్డి మెమోరియల్ క్లబ్బును వున్నవి. జన సంఖ్య 5000. పంచాయితీ బోర్డు, పంచాయితీ కోర్టు కూడా గలవు. రెడ్డిరాజులచే నిర్మింపబడిన ప్రాచీన శివాలయము, వీరభద్రాలయము ఆంధ్రులనాకర్షించుచున్నవి. మహమ్మదీయుల పండుగలు జరుపుటకు గవ్వలగట్టను చిన్న గుట్ట గలదు. గుట్ట వెనుక భాగమున విద్యాధరగజపతి వారి చెరువు గలదు. త్రిలింగ దేశము
ఆంధ్రదేశ మధ్యస్థంబై, పురాతన చరిత్ర ప్రసిద్ధంబైన నగరంబులకు గృష్ణానది కుత్తర భాగమున బెజవాడ మొదలు హైదరాబాదు వరకు మున్నొకప్పుడు త్రిలింగ దేశమని వహరింపబడియుండెను. అదియే లింగనాడు ఖండము, గోల్కొండసీమ యందురు..............
కొండపల్లి చరిత్ర కొండపల్లి కృష్ణాజిల్లాలో చేరిన బెజవాడ తాలూకా యందలి దుర్గారణ్య స్థలము. ఇది గొప్ప పర్వతము. దక్షిణం కృష్ణానది వరకును, ఉత్తరం కొండూరు, జుజ్జూరు వరకును వ్యాపించినది. దీని చుట్టు కొలత 100 మైళ్ళు. యీ పర్వతరాజమున ప్రతి సంవత్సరము శీతాఫలములు, కుంకుళ్లు, రేగుపండ్లు మొదలగునవి ఫలించును. కంప, కట్టె, పచ్చిక వగైరాలమీద ప్రభుత్వము వారికి సుమారు 15,000 రూపాయిలు ఆదాయము వచ్చుచుండును. ఈ కొండ పైన చిరుతపులులు, పెద్దపులులు మొదలగు క్రూరమృగముల భయమున్ను అప్పుడప్పుడు చోరభయమున్ను యుండును. కొండయెత్తు సుమారు 2 మైళ్ళు గలదు. కొండపల్లిలో బొమ్మలు రకరకములుగా అనాది నుంచి తయారు చేయుచున్న ఆర్య క్షత్రియ కుటుంబములు సుమారు 50 గలవు. వీరి శిల్ప చాతుర్యము వర్ణనాతీతము. అనాది నుండి యీ గ్రామము చేతి పరిశ్రమలకు నిలయమే. చాల కాలము కొండపల్లి కాగిత పరిశ్రమకు ఆధిక్యము కలిగి వాడుకలో ఉండెడిది. ఆ కాగితపు పరిశ్రమ యిప్పుడు కానరాదు. ప్రస్తుత మీ గ్రామమందు ఒక మాధ్యమిక పాఠశాలయు, కీ.శే. బొల్లారెడ్డి కోటిరెడ్డి జమిందారుగారి ధర్మసత్రమును, గుంటక నర్సారెడ్డిగారిచే నిర్మింపబడిన కోటిరెడ్డి మెమోరియల్ క్లబ్బును వున్నవి. జన సంఖ్య 5000. పంచాయితీ బోర్డు, పంచాయితీ కోర్టు కూడా గలవు. రెడ్డిరాజులచే నిర్మింపబడిన ప్రాచీన శివాలయము, వీరభద్రాలయము ఆంధ్రులనాకర్షించుచున్నవి. మహమ్మదీయుల పండుగలు జరుపుటకు గవ్వలగట్టను చిన్న గుట్ట గలదు. గుట్ట వెనుక భాగమున విద్యాధరగజపతి వారి చెరువు గలదు. త్రిలింగ దేశము ఆంధ్రదేశ మధ్యస్థంబై, పురాతన చరిత్ర ప్రసిద్ధంబైన నగరంబులకు గృష్ణానది కుత్తర భాగమున బెజవాడ మొదలు హైదరాబాదు వరకు మున్నొకప్పుడు త్రిలింగ దేశమని వహరింపబడియుండెను. అదియే లింగనాడు ఖండము, గోల్కొండసీమ యందురు..............© 2017,www.logili.com All Rights Reserved.