కొండపల్లి కృష్ణాజిల్లాలో చేరిన బెజవాడ తాలూకా మండలి దుర్గరణ్య స్థలము. ఇది గొప్ప పర్వతము. దక్షిణం కృష్ణానది వరకును, ఉత్తరం కొండూరు, జుజ్జురు వరకును వ్యాపించింది. దీని చుట్టూ కొంత 100 మైళ్ళు. యీ పర్వత రాజమున ప్రతి సంవత్సరము సీతాఫలములు, కుంకుళ్లు, రేగిపండ్లు మొదలగునవి ఫలించును. కంప, కట్టే, పచ్చిక వగైరాలమీద ప్రభుత్వము వారికి సుమారు 15 ,000 రూపాయిలు ఆదాయము వచ్చుచుండును. ఈ కొండ పైన చిరుతపులులు, పెద్దపులులు మొదలగు క్రూరమృగముల భయమున్ను అప్పుడప్పుడు చోరభయమున్ను యుండును. కొండయెత్తు సుమారు 2 మైళ్ళు గలదు.
- డా. ఈమని శివనాగిరెడ్డి.