18వ శతాబ్దపు చివరి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రదేశంలో జరిపిన చారిత్రక, పురావస్తు పరిశోధనల్లో దాదాపు 200 బౌద్ధ క్షేత్రాలను గుర్తించటం జరిగింది. ఆయా ప్రాంతాల్లోని స్తూపాలు, చైత్యాలు, గుహాలయాలు, శిలామంటపాలు, బౌద్ధశిల్పాలపై వచ్చిన నివేదికలో కట్టడాల కొలతలు, వాటిని కట్టినతీరు, కట్టడానికి దానాలిచ్చిన దాతల వివరాలు ఉన్నాయి. పరిపాలనాపరమైన విధుల్లో భాగంగానే కాక, వ్యక్తిగత కుతూహలంతో, బ్రిటీషు అధికారులు తాము చూచిన బౌద్ధ స్థలాలు, కట్టడాలపై తయారుచేసిన నివేదికలు వివిధ పత్రికల్లో అచ్చైనాయి. బౌద్ధకట్టడ, శిల్ప శాసనాలను పరిశోధించేవారికి ఈ నివేది కలు ప్రామాణికమైన ప్రాథమిక ఆధారాలుగా ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉన్నాయి.
బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతకకధా దృశ్యాలకు అద్దం పడుతున్న కట్టడాలు, శిల్పాలను మలచిన, బౌద్ధ శిల్పుల్ని చారిత్రక పరిశోధకులు అంతగా పట్టించుకోక పోవటం విచారించదగ్గ విషయం. ప్రాచీన ఆంధ్రదేశంలోని బౌద్ధ శిల్పుల గురించి ప్రామాణికమూ, సమగ్రమూ అయిన అధ్యయనం జరగలేదనే చెప్పాలి. శిల్పుల్లో బౌద్ధ శిల్పులు వేరే ఉండే వాళ్ళా? ఉంటే వాళ్లను ఎలా పిలిచేవాళ్లు, బౌద్ధసంఘంలోకివారిని ఎలా ఎంపిక చేసేవారు? అనే వివరాలు తెలుసుకోవడం కోసం ఆ శిల్పుల వృత్తిపరమైన హోదా, స్థాయి, ఇంకా ఇతర సాంకేతికాంశాలపై సమగ్రమైన సమాచారాన్నందించే రచనలు ఇంతవరకూ అందుబాటులో లేని మాటకూడా నిజమే........................
ప్రవేశిక 18వ శతాబ్దపు చివరి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రదేశంలో జరిపిన చారిత్రక, పురావస్తు పరిశోధనల్లో దాదాపు 200 బౌద్ధ క్షేత్రాలను గుర్తించటం జరిగింది. ఆయా ప్రాంతాల్లోని స్తూపాలు, చైత్యాలు, గుహాలయాలు, శిలామంటపాలు, బౌద్ధశిల్పాలపై వచ్చిన నివేదికలో కట్టడాల కొలతలు, వాటిని కట్టినతీరు, కట్టడానికి దానాలిచ్చిన దాతల వివరాలు ఉన్నాయి. పరిపాలనాపరమైన విధుల్లో భాగంగానే కాక, వ్యక్తిగత కుతూహలంతో, బ్రిటీషు అధికారులు తాము చూచిన బౌద్ధ స్థలాలు, కట్టడాలపై తయారుచేసిన నివేదికలు వివిధ పత్రికల్లో అచ్చైనాయి. బౌద్ధకట్టడ, శిల్ప శాసనాలను పరిశోధించేవారికి ఈ నివేది కలు ప్రామాణికమైన ప్రాథమిక ఆధారాలుగా ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉన్నాయి. బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతకకధా దృశ్యాలకు అద్దం పడుతున్న కట్టడాలు, శిల్పాలను మలచిన, బౌద్ధ శిల్పుల్ని చారిత్రక పరిశోధకులు అంతగా పట్టించుకోక పోవటం విచారించదగ్గ విషయం. ప్రాచీన ఆంధ్రదేశంలోని బౌద్ధ శిల్పుల గురించి ప్రామాణికమూ, సమగ్రమూ అయిన అధ్యయనం జరగలేదనే చెప్పాలి. శిల్పుల్లో బౌద్ధ శిల్పులు వేరే ఉండే వాళ్ళా? ఉంటే వాళ్లను ఎలా పిలిచేవాళ్లు, బౌద్ధసంఘంలోకివారిని ఎలా ఎంపిక చేసేవారు? అనే వివరాలు తెలుసుకోవడం కోసం ఆ శిల్పుల వృత్తిపరమైన హోదా, స్థాయి, ఇంకా ఇతర సాంకేతికాంశాలపై సమగ్రమైన సమాచారాన్నందించే రచనలు ఇంతవరకూ అందుబాటులో లేని మాటకూడా నిజమే........................© 2017,www.logili.com All Rights Reserved.