ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రచనలకు అదనంగా ఇవ్వాళ అత్యవసరమైన మరింత సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఆంధ్రరాష్ట్రం భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తోలి రాష్ట్రం. 1953 అక్టోబర్ 1 న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాత మరెన్నో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం భాషను ప్రజల ఐక్యతకు ప్రాథమికమైన ఆధారంగా చూడడమే దీనికి కారణం. అయితే స్థానికమైన రాజకీయ సాంస్కృతిక ఆకాంక్షలను, సామజిక ఆర్థిక అవసరాలను తీర్చడంలో విఫలమైనప్పుడు అదే ఒక విభాజికశక్తిగా రూపొందింది.
ఆంధ్రరాష్ట్రం కర్నూలు నుండి 1956 లో హైదరాబాదుకు రాజధాని మారే క్రమంలో గొప్ప మార్పు పొందింది. హైదరాబాదు తెలుగు మాట్లాడే ప్రజల విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకుంది. 2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అది మళ్లీ మిగిలిపోయిన పాత ఆంధ్ర రాష్ట్రం అయిపొయింది (పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్).
- ఐ. వై. ఆర్. కృష్ణారావు