అర్థ శతాబ్దం పాటు అవిశ్రాంత ప్రజాసేవలో ఎర్రని పదునెక్కిన జీవితం కామ్రేడ్ రాజశేఖరరెడ్డిది. జాతీయోద్యమానికి, కమ్యూనిస్టు విప్లవోద్యమానికి గల ఉమ్మడి విలక్షణాలు కలబోసిన ధీరోదాత్త వ్యక్తిత్వం ఆ మహనీయునిది. సునిశితమైన విశ్లేషణాత్మక ధోరణిలో పరిశీలించే విప్లవతత్వం అలవరచుకున్న శేముషినిది కామ్రేడ్ రాజశేఖరరెడ్డి. పదుల, వందల సంఖ్యలో కార్యకర్తల మెదడు పదును ఎక్కడానికి వీలైన బృహత్ కార్యక్రమాల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీ విద్య వ్యవస్థ విస్తరణ క్రమంలో కులపతిగా రాణించారు. తీరికలేని రాజకీయ వ్యవహారాల్లో ఏ కొంచెం అవకాశం చిక్కిన, సాహిత్య సంగీతాల్లో పురోగామి సంస్కార విలసితమైన మధురిమల ఆస్వాదనలో పొద్దుపుచ్చే వారు.
- శ్రీ వై. వి. కృష్ణారావు