ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కలాన్ని కదిలించింది. ఏ భావం కన్నీళ్లను కరగించి అక్షరాలుగా మార్చింది..! ఏ సంఘటన హృదయస్పందన కవితాధారలై స్పందించింది...! అదే 1948 లో జరిగిన రజాకార్ల దారుణ పైశాచిక. అది యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య! మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన హైద్రాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుత్సితకుతంత్రాలకు తల్లడిల్లిన తరుణం. వేలాది మంది ధీరుల త్యాగాలతో తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన వైనం. దాస్య శృంఖలాల నుండి భరతమాత బంధాలు విడిపించినా తెలంగాణా మాత్రం పరతంత్రం కావడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది.
కానీ.. విధి విచిత్రం కదా! 'సైనికదాడులనైనా అరికట్ట వచ్చునుకాని ప్రజల హృదయాంతరాళాల నుండి పెల్లుబికి వచ్చే స్వతంత్ర భావతరంగాలను అపజాలరనేది చరిత్రలో బుజువైనసత్యం' అని ఓ చరిత్రకారుడన్నట్లు రజాకార్ ముష్కరమూకల దాడులనెదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్య సాహసాలు వేనోళ్లు పొగడవచ్చు.
- డా. పి. భాస్కరయోగి