కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణ రావు కృష్ణాజిల్లా అంపాపురం వాస్తవ్యులు. ఆంద్రవిశ్వకళాపరిషత్తు గౌరవసలహాదారుగా ఉన్నారు. చరిత్ర రచనా కోవిదులైన సత్యనారాయణరావు గారు నూజివీటి రాజవంశ చరిత్ర, పద్మనాయక చరిత్ర, ధర్మ అప్పారాయ చరిత్ర, జూపల్లి పద్మనాయకుల చరిత్ర, సర్వజ్ఞసింగ భూపాలుదీప్తి, పసుమతీ - వసంతులు మొదలైన గ్రంథాలను రచ్న్చారు. సాహితీ కుసుమాలు అనే సంకలన గ్రంథాలను కూర్చారు. నూజివీటి రాజవంశపు బంధువర్గము లోనివారు శ్రీ బుచ్చినాయనగారు.
'చరిత్ర రచనా ప్రఖ్యాత' అని ప్రసిద్ధులు. కవి పండిత సత్కారాలు చేయడం, అముద్రిత గ్రంథాలను ప్రచురించి పంచిపెట్టడం వీరి నిత్యకృత్యం. శ్రీ అప్పారావు గ్రంథమాలను పునరుద్ధరించి అనేక గ్రంథాలను ప్రచురింపజేశారు. ఆంధ్రదేశ చరిత్రలో రాజులుగా, మంత్రులుగా, సేనానులుగా, సామంత ప్రభువులుగా, దుర్గాదిపతులుగా, యోధాగ్రేసరులుగా కీలకపాత్ర వహించిన పద్మనాయకుల ప్రామాణిక చరిత్ర గ్రంథం బుచ్చినాయనగారి 'పద్మనాయక చరిత్ర'.
కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణ రావు కృష్ణాజిల్లా అంపాపురం వాస్తవ్యులు. ఆంద్రవిశ్వకళాపరిషత్తు గౌరవసలహాదారుగా ఉన్నారు. చరిత్ర రచనా కోవిదులైన సత్యనారాయణరావు గారు నూజివీటి రాజవంశ చరిత్ర, పద్మనాయక చరిత్ర, ధర్మ అప్పారాయ చరిత్ర, జూపల్లి పద్మనాయకుల చరిత్ర, సర్వజ్ఞసింగ భూపాలుదీప్తి, పసుమతీ - వసంతులు మొదలైన గ్రంథాలను రచ్న్చారు. సాహితీ కుసుమాలు అనే సంకలన గ్రంథాలను కూర్చారు. నూజివీటి రాజవంశపు బంధువర్గము లోనివారు శ్రీ బుచ్చినాయనగారు. 'చరిత్ర రచనా ప్రఖ్యాత' అని ప్రసిద్ధులు. కవి పండిత సత్కారాలు చేయడం, అముద్రిత గ్రంథాలను ప్రచురించి పంచిపెట్టడం వీరి నిత్యకృత్యం. శ్రీ అప్పారావు గ్రంథమాలను పునరుద్ధరించి అనేక గ్రంథాలను ప్రచురింపజేశారు. ఆంధ్రదేశ చరిత్రలో రాజులుగా, మంత్రులుగా, సేనానులుగా, సామంత ప్రభువులుగా, దుర్గాదిపతులుగా, యోధాగ్రేసరులుగా కీలకపాత్ర వహించిన పద్మనాయకుల ప్రామాణిక చరిత్ర గ్రంథం బుచ్చినాయనగారి 'పద్మనాయక చరిత్ర'.© 2017,www.logili.com All Rights Reserved.