ఈ పుస్తకం రూపొందించాలని నేను పని ప్రారంభించినపుడు విషయ క్రోడీకరణ స్వభావం ఎలా ఉండాలనేది నాకెదురైన సమస్య. నరేంద్రమోడి సంక్లిష్టత, నిరాడంబరత రెండూ మూర్తీభవించిన వ్యక్తి. బహుశా వ్యక్తిత్వపు లోతులో దర్శించగల అతడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు. స్థిరమైన వ్యక్తిత్వం గలవాడు. ఏ ప్రలోభాలకూ లొంగనివాడు. ఉద్వేగరహితంగా సూక్ష్మమైన అవగాహనతో ఒక విధమైన ఎకత్వంతో సంక్షోభాలను అధిగమించగల నిశ్చలమైన వ్యక్తిత్వం మోడిది.
ఇటీవల కొద్ది మాసాల్లో ఆయన బి జె పి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యాక గుజరాత్ లో అభివృద్ధి రికార్డు కూడా సూక్ష్మ పరిశీలనకు గురౌతోంది. మోడి నియంత అని రాష్ట్రాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తాడని, తన ప్రచారంలో, ఉపన్యాసంలో చెప్పుతున్న గుణంకాల వివరాలు తప్పులని దేశ భవిష్యత్తుకు సంబంధించి అతనికి ఎలాంటి ప్రత్యామ్నాయ దృష్టి లేదని ఆయన రాజకీయ వ్యతిరేకులు, ప్రసారమాధ్యమాలు ఆరోపిస్తున్నాయి. నేను వీటిలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరీక్షించి వాస్తవాలు గ్రహించి వాటిని ఊహాజనిత విషయాలనుండి వేరుచేశాను.
మోడికి సంబంధించి సమతుల్యత గల వాస్తవిక దృక్పథంతో కూడి ఉన్న నిజాయితీ గల కథనం అవసరం. అతని లోపాలను కూడా విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఈ పుస్తకం ఉన్నత ప్రమాణాలు గలదిగా గుర్తించబడుతుందని నేను ఆశిస్తున్నాను.
ఈ పుస్తకం రూపొందించాలని నేను పని ప్రారంభించినపుడు విషయ క్రోడీకరణ స్వభావం ఎలా ఉండాలనేది నాకెదురైన సమస్య. నరేంద్రమోడి సంక్లిష్టత, నిరాడంబరత రెండూ మూర్తీభవించిన వ్యక్తి. బహుశా వ్యక్తిత్వపు లోతులో దర్శించగల అతడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు. స్థిరమైన వ్యక్తిత్వం గలవాడు. ఏ ప్రలోభాలకూ లొంగనివాడు. ఉద్వేగరహితంగా సూక్ష్మమైన అవగాహనతో ఒక విధమైన ఎకత్వంతో సంక్షోభాలను అధిగమించగల నిశ్చలమైన వ్యక్తిత్వం మోడిది. ఇటీవల కొద్ది మాసాల్లో ఆయన బి జె పి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యాక గుజరాత్ లో అభివృద్ధి రికార్డు కూడా సూక్ష్మ పరిశీలనకు గురౌతోంది. మోడి నియంత అని రాష్ట్రాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తాడని, తన ప్రచారంలో, ఉపన్యాసంలో చెప్పుతున్న గుణంకాల వివరాలు తప్పులని దేశ భవిష్యత్తుకు సంబంధించి అతనికి ఎలాంటి ప్రత్యామ్నాయ దృష్టి లేదని ఆయన రాజకీయ వ్యతిరేకులు, ప్రసారమాధ్యమాలు ఆరోపిస్తున్నాయి. నేను వీటిలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరీక్షించి వాస్తవాలు గ్రహించి వాటిని ఊహాజనిత విషయాలనుండి వేరుచేశాను. మోడికి సంబంధించి సమతుల్యత గల వాస్తవిక దృక్పథంతో కూడి ఉన్న నిజాయితీ గల కథనం అవసరం. అతని లోపాలను కూడా విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఈ పుస్తకం ఉన్నత ప్రమాణాలు గలదిగా గుర్తించబడుతుందని నేను ఆశిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.