భారతీయ చరిత్రలో, సాహిత్యంలో, సంస్కృతీ నిర్మాణంలో రెండువేల యేళ్ళుగా తమిళనాడు పోషించిన పాత్ర అద్వితీయం. ప్రాచీన తమిళదేశంలో సంగం, జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ సాహిత్యాలు ఒక అలౌకిక సౌందర్యాన్ని, తమిళ ప్రాకృతిక సీమకి జతపరుస్తూ తమిళజాతికొక సాహిత్య సంస్కారాన్ని సమకూరుస్తూ వచ్చాయి. సంగం సాహిత్యం తమిళ భూగోళన్ని ఐదు ప్రాకృతిక సీమలుగా గుర్తించి వాటిని ఐదు ప్రాకృతిక సీమలుగా గుర్తించి వాటిని ఐదు ప్రణయావస్థలలో జతపరచి అద్భుతమైన ప్రేమ కవిత్వాన్ని సృజించింది. ఈ కవిత్వపు పాదులో వికసించిన భక్తికవులు భారతీయ భక్తి సాహిత్యానికే మార్గదర్శకులయ్యారు.
- వాడ్రేవు చినవీరభద్రుడు