చినవీరభద్రుడు సమకాలీన సాహిత్యంలో అత్యున్నత సాహితీవేత్తల్లో ఒకరు. ఓ సాహితీ ప్రశంసకుడిగా ప్రారంభమైన ప్రయాణంలో అతను ఓ సాహితీప్రవచనకారుడిగా రూపాంతరం చెందాడు. ఈ మాటలు అతనితో నా సుమారు ఒకటిన్నర దశాబ్దాల సాహచర్యంతో చెప్పినవి. గొప్ప వక్త, కవి, పండితుడు, అన్వేషి, తాత్త్వికుడు, తార్కికుడు, చిత్రకారుడు వంటి ఇన్ని పార్శ్వాలు ఓ మనిషిలో బహు అరుదుగా కనిపిస్తాయి.
ఈ పుస్తకంలో వ్యాసాలు వివిధ సందర్భాల్లో వివిధ విషయాల గురించి రచించినవి. అయితే వీటన్నిటికి ఉన్న అంతఃసూత్రం మాత్రం ఒకటి. అదే సాహితీప్రశంస. సాహిత్యం, జీవితం, ప్రపంచం మూడింటిని అనుసంధానం చేయడంలో, సాహితీసందర్భాన్ని ఆవిష్కరించడంలో ఇతని ప్రతిభ ప్రతి వ్యాసంలోను మనకి కనిపిస్తుంది. అయితే ముందుగానే నేను చెప్పినట్లు ఈ సాహితీప్రశంసకుడు అనేక సందర్భాల్లో ప్రవచనకారుడిగాను కనిపిస్తాడు. ఆ సాహిత్య విషయంపై అతనికున్న ప్రేమ కొండొకచో అతిశయోక్తిగానూ అనిపించవచ్చు.
- విజయకుమార్
చినవీరభద్రుడు సమకాలీన సాహిత్యంలో అత్యున్నత సాహితీవేత్తల్లో ఒకరు. ఓ సాహితీ ప్రశంసకుడిగా ప్రారంభమైన ప్రయాణంలో అతను ఓ సాహితీప్రవచనకారుడిగా రూపాంతరం చెందాడు. ఈ మాటలు అతనితో నా సుమారు ఒకటిన్నర దశాబ్దాల సాహచర్యంతో చెప్పినవి. గొప్ప వక్త, కవి, పండితుడు, అన్వేషి, తాత్త్వికుడు, తార్కికుడు, చిత్రకారుడు వంటి ఇన్ని పార్శ్వాలు ఓ మనిషిలో బహు అరుదుగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో వ్యాసాలు వివిధ సందర్భాల్లో వివిధ విషయాల గురించి రచించినవి. అయితే వీటన్నిటికి ఉన్న అంతఃసూత్రం మాత్రం ఒకటి. అదే సాహితీప్రశంస. సాహిత్యం, జీవితం, ప్రపంచం మూడింటిని అనుసంధానం చేయడంలో, సాహితీసందర్భాన్ని ఆవిష్కరించడంలో ఇతని ప్రతిభ ప్రతి వ్యాసంలోను మనకి కనిపిస్తుంది. అయితే ముందుగానే నేను చెప్పినట్లు ఈ సాహితీప్రశంసకుడు అనేక సందర్భాల్లో ప్రవచనకారుడిగాను కనిపిస్తాడు. ఆ సాహిత్య విషయంపై అతనికున్న ప్రేమ కొండొకచో అతిశయోక్తిగానూ అనిపించవచ్చు. - విజయకుమార్© 2017,www.logili.com All Rights Reserved.