ముక్కామల నాగభూషణం గారు 1910 ఫిబ్రవరి 4 న కృష్ణాజిల్లా బుద్ధవరం గ్రామంలో జన్మించారు.
1921 బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వలంటీరుగా పాల్గొన్నారు. తదాదిగా స్వాతంత్ర్య సమరంలోనూ, జమిందారీ వ్యతిరేక పోరాటాలలోనూ పాల్గొన్నారు. జైళ్ళకు వెళ్ళారు. రాజమండ్రి జైలు నుండి తప్పించుకుపోయారు. సంవత్సరాల తరబడి అజ్ఞాతవాసంలో వుండి పోరాడారు.
బాల్యం నుండి సంఘ సంస్కరణోద్యమంతోనూ, రైతు ఉద్యమంతోనూ, జాతీయ ఉద్యమంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పెక్కు ఆదర్శ వివాహాలు చేయించారు.
వివిధ ఉద్యమాలకు సంబంధించిన అనేక వ్యాసాలు, పాటలు, పుస్తకాలూ రాశారు. దశాబ్దకాలం పాటు వీరు ప్రగతి, ఆంధ్రావని వార్తాపత్రికులకు సంపాదకులుగా వున్నారు.