తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పెర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలను పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలూ, ఏ నగరాలను ఎలా నిర్మించాయో, వీటి ప్రభావం నగరాల నిర్మాణాలలోనూ, ఎలా ప్రతిబింబించాయో కళ్ళకుకట్టించే దృశ్యకావ్యం ఇది.
'ఆర్షశాఖ' వారి ఆధారాలను అడుగడుగునా తమ పరిశీలనాంశాలతో సంవదించుకుంటూ వాటిని - తాను చూసినవాటికి అన్వయించుకుంటూ రాసిన చారిత్రిక గ్రంథం ఇది. ఆదిరాజు వీరభద్రరావు గారు ఎంతగానో శ్రమిస్తూ కార్యదీక్షాదక్షతలు నగరాలను చూస్తూ, వివరాలను సేకరిస్తూ వాటిని భావితరాలకు అందించాలన్న తపనతో రాసిన ప్రాచీన గ్రంథం ఇది. తెలంగాణ నగరాల గత వైభవ స్మరణకూ, ఆ స్ఫూర్తితో వాటిని మరింత ఆదర్శవంతంగా, చారిత్రిక సామాగ్రినీ శకలాలనూ భద్రపరుస్తూ భావితరాలకు అందించడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది.
- ఏటుకూరి ప్రసాద్
తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పెర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలను పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలూ, ఏ నగరాలను ఎలా నిర్మించాయో, వీటి ప్రభావం నగరాల నిర్మాణాలలోనూ, ఎలా ప్రతిబింబించాయో కళ్ళకుకట్టించే దృశ్యకావ్యం ఇది. 'ఆర్షశాఖ' వారి ఆధారాలను అడుగడుగునా తమ పరిశీలనాంశాలతో సంవదించుకుంటూ వాటిని - తాను చూసినవాటికి అన్వయించుకుంటూ రాసిన చారిత్రిక గ్రంథం ఇది. ఆదిరాజు వీరభద్రరావు గారు ఎంతగానో శ్రమిస్తూ కార్యదీక్షాదక్షతలు నగరాలను చూస్తూ, వివరాలను సేకరిస్తూ వాటిని భావితరాలకు అందించాలన్న తపనతో రాసిన ప్రాచీన గ్రంథం ఇది. తెలంగాణ నగరాల గత వైభవ స్మరణకూ, ఆ స్ఫూర్తితో వాటిని మరింత ఆదర్శవంతంగా, చారిత్రిక సామాగ్రినీ శకలాలనూ భద్రపరుస్తూ భావితరాలకు అందించడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది. - ఏటుకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.