అయిదేళ్ళ బాలిక శివగామి. మాహిష్మతి మహారాజు తన తండ్రిని ద్రోహిగా చిత్రించి చంపడం చూసిన క్షణంలోనే ఆ రాజ్యాన్ని నాశనం చేస్తానని ఒట్టు పెట్టుకుంది. పదిహేడేళ్ళ ప్రాయంలో శిథిలమైపోతున్న పూర్వీకుల భవంతి నుంచి ఒక గ్రంథం రాతప్రతిని ఆమె సంపాదించింది. ఆ గ్రంథం పైశాచి భాషలో ఉంది. తండ్రిని ద్రోహి అనే ముద్ర నుంచి విముక్తం చేసేదో, లేకపోతే ఆయన మీద ఇంకా ద్వేషం కలుగజేసేదో అయిన రహస్యం దానిలో ఉంది.
తన విధిని గుడ్డిగా నమ్మి గర్వంగా నిర్వహించే కట్టప్ప ఆదర్శ యువ బానిస. దుష్టుడైన రాజకుమారుడికి సేవకు నియుక్తుడవుతాడు. తమ సామాజిక హోదాను అసహ్యించుకుంటూ, స్వాతంత్రం కోసం తపించే చిన్న సోదరుణ్ణి ఇబ్బందుల నుంచి తప్పించాల్సిన బాధ్యత అతనికి ఉంది. రాతపత్రి నుంచి రహస్యం తెలుసుకోవాలన్న శివగామికి, మాహిష్మతి సామ్రాజ్యంలో కుట్రలు, రాజభవనంలో కుతంత్రాలు, అవినీతిపరులైన అధికారులు, విప్లవకారుల గురించి తెలుస్తుంది.
అధికారం, డబ్బుకోసం రాచకుటుంబీకులు ఏమైనా చేస్తారు. రహస్యంగా డెబ్బయేళ్ళ వృద్ధ మహిళ నాయకత్వంలో బానిస వ్యాపారాన్ని ఆపాలని కొందరు యోధులు దృఢసంకల్పంతో ఉన్నారు. మూడువందల ఏళ్లకిందట తమ నివాసమైన పవిత్ర పర్వతం నుంచి వెళ్ళగొట్టబడిన గిరిజన జాతి ద్వేషంతో రాజు మీద యుద్ధానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. తరువాత ఏం జరిగిందో ఈ కథ చదివి తెలుసుకొనగలరు.
అయిదేళ్ళ బాలిక శివగామి. మాహిష్మతి మహారాజు తన తండ్రిని ద్రోహిగా చిత్రించి చంపడం చూసిన క్షణంలోనే ఆ రాజ్యాన్ని నాశనం చేస్తానని ఒట్టు పెట్టుకుంది. పదిహేడేళ్ళ ప్రాయంలో శిథిలమైపోతున్న పూర్వీకుల భవంతి నుంచి ఒక గ్రంథం రాతప్రతిని ఆమె సంపాదించింది. ఆ గ్రంథం పైశాచి భాషలో ఉంది. తండ్రిని ద్రోహి అనే ముద్ర నుంచి విముక్తం చేసేదో, లేకపోతే ఆయన మీద ఇంకా ద్వేషం కలుగజేసేదో అయిన రహస్యం దానిలో ఉంది. తన విధిని గుడ్డిగా నమ్మి గర్వంగా నిర్వహించే కట్టప్ప ఆదర్శ యువ బానిస. దుష్టుడైన రాజకుమారుడికి సేవకు నియుక్తుడవుతాడు. తమ సామాజిక హోదాను అసహ్యించుకుంటూ, స్వాతంత్రం కోసం తపించే చిన్న సోదరుణ్ణి ఇబ్బందుల నుంచి తప్పించాల్సిన బాధ్యత అతనికి ఉంది. రాతపత్రి నుంచి రహస్యం తెలుసుకోవాలన్న శివగామికి, మాహిష్మతి సామ్రాజ్యంలో కుట్రలు, రాజభవనంలో కుతంత్రాలు, అవినీతిపరులైన అధికారులు, విప్లవకారుల గురించి తెలుస్తుంది. అధికారం, డబ్బుకోసం రాచకుటుంబీకులు ఏమైనా చేస్తారు. రహస్యంగా డెబ్బయేళ్ళ వృద్ధ మహిళ నాయకత్వంలో బానిస వ్యాపారాన్ని ఆపాలని కొందరు యోధులు దృఢసంకల్పంతో ఉన్నారు. మూడువందల ఏళ్లకిందట తమ నివాసమైన పవిత్ర పర్వతం నుంచి వెళ్ళగొట్టబడిన గిరిజన జాతి ద్వేషంతో రాజు మీద యుద్ధానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. తరువాత ఏం జరిగిందో ఈ కథ చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.