కవిత చెప్పనికథ - పొద్దున్నే కవిగొంతు
డా॥ శిఖామణి కవికుల గురువు కె. శివారెడ్డిగారిని తన తరం తర్వాతి కవులు అధిక శాతం మంది గురువుగా భావిస్తారు. స్నేహితుడిగానూ అనుకుంటారు. దానికి కారణం ఆయన స్వభావంలోవున్న సారళ్యం, ఫ్లెక్సిబిలిటి. ఆ స్వభావమే ఆయనను అనేక మంది చిన్నా పెద్దా కవుల దగ్గరకు చేర్చింది. శివారెడ్డిగారితో నా తొలిపరిచయం వుత్తరం రాయడం, పుస్తకం పంపడంతోనే. 1987లో నా తొలి కవితాసంపుటి మువ్వల చేతికర్రను ఆయన ఖైరతాబాద్ అడ్రసుకు పంపితే చదివి మంచి వుత్తరం రాసారు. చాలా కవితలు చదివి పేజీల చివర్లు మడత పెట్టుకున్నాననీ, చదువుతూ చదువుతూ పుస్తకాన్ని గుండెల మీద బోర్లించి పెట్టుకున్నాననీ ఆ వుత్తరం సారాంశం. ఈ విషయాన్ని ఇప్పుడు ఆయనకు గుర్తుచేస్తే ఏమో... అని తనదైన భాషలో స్పందిస్తాడనుకుంటాను. ఆంధ్రా యునివర్సిటీలో రీసెర్చిస్కాలర్ గా వుండగా ఒకసారి జనసాహితి సభలు జరిగాయి. దానికి శివారెడ్డి గారి నేతృత్వంలో ద్వారకా కవులు అందరూ బయలుదేరి వచ్చారు. ఆ బృందంలో ఎవరెవరు వున్నారో గుర్తులేదు కానీ సభలు అయిపోయిన రెండో రోజున నా హాస్టల్ గది 74కు శివారెడ్డిగారితోపాటు ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, నాళేశ్వరం శంకరం, ఒకరిద్దరు విశాఖమిత్రులు వచ్చారు. ఆ గదిలో నేను మిత్రుడు చప్పు సూర్యనారాయణ వున్నాం. ఆ రాత్రంతా కవిత్వం కబుర్లతో జాగారం. ఆ ఉదయం లేవగానే కందుకూరి శ్రీరాములు సముద్రం ఎక్కడ అని అడిగారు డాబా మీదికి తీసుకెళ్లి చూపించాను. చాలా సేపు పోల్చుకోలేక పోయాడు. చివరికి
శిఖామణి •5.......
కవిత చెప్పనికథ - పొద్దున్నే కవిగొంతు డా॥ శిఖామణి కవికుల గురువు కె. శివారెడ్డిగారిని తన తరం తర్వాతి కవులు అధిక శాతం మంది గురువుగా భావిస్తారు. స్నేహితుడిగానూ అనుకుంటారు. దానికి కారణం ఆయన స్వభావంలోవున్న సారళ్యం, ఫ్లెక్సిబిలిటి. ఆ స్వభావమే ఆయనను అనేక మంది చిన్నా పెద్దా కవుల దగ్గరకు చేర్చింది. శివారెడ్డిగారితో నా తొలిపరిచయం వుత్తరం రాయడం, పుస్తకం పంపడంతోనే. 1987లో నా తొలి కవితాసంపుటి మువ్వల చేతికర్రను ఆయన ఖైరతాబాద్ అడ్రసుకు పంపితే చదివి మంచి వుత్తరం రాసారు. చాలా కవితలు చదివి పేజీల చివర్లు మడత పెట్టుకున్నాననీ, చదువుతూ చదువుతూ పుస్తకాన్ని గుండెల మీద బోర్లించి పెట్టుకున్నాననీ ఆ వుత్తరం సారాంశం. ఈ విషయాన్ని ఇప్పుడు ఆయనకు గుర్తుచేస్తే ఏమో... అని తనదైన భాషలో స్పందిస్తాడనుకుంటాను. ఆంధ్రా యునివర్సిటీలో రీసెర్చిస్కాలర్ గా వుండగా ఒకసారి జనసాహితి సభలు జరిగాయి. దానికి శివారెడ్డి గారి నేతృత్వంలో ద్వారకా కవులు అందరూ బయలుదేరి వచ్చారు. ఆ బృందంలో ఎవరెవరు వున్నారో గుర్తులేదు కానీ సభలు అయిపోయిన రెండో రోజున నా హాస్టల్ గది 74కు శివారెడ్డిగారితోపాటు ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, నాళేశ్వరం శంకరం, ఒకరిద్దరు విశాఖమిత్రులు వచ్చారు. ఆ గదిలో నేను మిత్రుడు చప్పు సూర్యనారాయణ వున్నాం. ఆ రాత్రంతా కవిత్వం కబుర్లతో జాగారం. ఆ ఉదయం లేవగానే కందుకూరి శ్రీరాములు సముద్రం ఎక్కడ అని అడిగారు డాబా మీదికి తీసుకెళ్లి చూపించాను. చాలా సేపు పోల్చుకోలేక పోయాడు. చివరికి శిఖామణి •5.......© 2017,www.logili.com All Rights Reserved.