ఆధునిక విమర్శకు దిక్సూచి
- పద్మశ్రీ, ఆచార్య కొలకలూరి ఇనాక్
ఈ పుస్తకం పేరు “శిఖామణి పీఠికలు" అని వేరుగా నేనుగా చెప్పనక్కరలేదు. శిఖామణి కవి. ఆచార్య కె. సంజీవరావు పరిశోధకుడు. పరిశోధన పర్యవేక్షకుడు. పైగా వందల గ్రంథాలకు పీఠికాకర్త. కావ్య కన్యకల కన్న తల్లి దండ్రులు పూర్వ, సమకాలిక కవులను అర్థించి తమ కావ్య కన్యకలకు పీఠికా కళ్యాణ తిలకం దిద్దమని కోరాలనుకోవటం, కోరటం ముదావహం. వాళ్ళ కోరిక మన్నించటం కలల సౌజన్యం. పీఠికల బొట్టూ కాటుక పెట్టి, ఇంత పౌడరు రాసి కావ్య కన్యకల్ని సహృదయుల సన్నిధికి పంపటం సంతోష సంపాదకం. ఇంత సంతోషమైన శుభకార్యం శిఖామణి నిర్వహించారు.
ఆచార్య కె. సంజీవరావు శిఖామణిగా జగమెరిగిన కవి. పరిశోధకుడు సత్య సంధాత. కవి. సృజనశీలి. పరిశోధకుడు. వస్తుతత్త్వ ఆలోచన కర్త. కవి హృదయతత్త్వ అనుభూతి వేత, పరిశోధకుడు కవి కలిస్తే ఆలోచనానుభూతులు సంగమిస్తాయి. పరిశోధకులు సత్యం చెబుతారు. కవులు కల్పనలు అందిస్తారు. సత్య కల్పనలు సరిగమలు పాడితే రాగం పుడుతుంది. అనురాగం పండుతుంది. ఆ రాగానురాగాల పంట ఈ గ్రంథం. దీనికి పరిశోధకకవి శిఖామణి పీఠికలు' అని పేరు పెట్టాడు. సంజీవరావుకు శిఖామణి' ఎక్కువ ఇష్టంగా ఉన్నట్లుగా ఉంది. కవిత్వానికి శిఖామణి, పరిశోధనకు సంజీవరావు ప్రసిద్ధులు. పీఠికల శీర్షికలన్నీ కవిత్వమే ! అందుకే వీటిని శిఖామణికే సొంతం చేశాడు. నిజానికది సంజీవరావు ఆస్తి హక్కు ఈ వ్యక్తికి ఆచార్యుడు ఒక పార్శ్వం కవి మరో పార్శ్వం . ఆచార్యుడికి కూడా కవే ఎక్కువ ఇష్టమయినట్లుంది. అందుకే ఇవి శిఖామణి పీఠికలయ్యాయి. |
ఇవి ఇలా కావటానికి కారణం పీఠికల శీర్షికలన్నీ కవిత్వమే కావటం. పీఠికా సాహిత్యమంతా కవిత్వమే. కవిత్వం నిండా ప్రేమే ! పీఠికలనిండా ప్రోత్సాహమే ! కవిని, రచయితను, రచయిత్రిని, పరిశోధకుల్ని ప్రోత్సహించటమే లక్ష్యం. ఇందులో నూరుకు పైగా పీఠికలున్నాయి.
ఈ పీఠికలు 15-20 ఏళ్ళుగా వ్రాస్తున్నట్లు కనిపిస్తుంది, రాసిన పీఠికలన్ని ఆచార్యుడి దగ్గర ఉండటంకానీ, తన పీఠికలతో ముద్రించిన గ్రంథాలన్నీ ఆయా గ్రంథకర్తలు వాటిని కవి దగ్గరకు చేర్చటంకానీ, గొప్ప విషయాలే ! ఇది ఎంతలేదన్నా 500 పేజీల మహాగ్రంథం కావటం ఖాయం. ఇంత పెద్ద పీఠికా గ్రంథం ఇంతకు ముందు ఎక్కడా చూచి ఉండం. ఇదొక చరిత్ర. ఆధునికుల మాటల్లో ఇదొక రికార్డు...........
ఆధునిక విమర్శకు దిక్సూచి - పద్మశ్రీ, ఆచార్య కొలకలూరి ఇనాక్ ఈ పుస్తకం పేరు “శిఖామణి పీఠికలు" అని వేరుగా నేనుగా చెప్పనక్కరలేదు. శిఖామణి కవి. ఆచార్య కె. సంజీవరావు పరిశోధకుడు. పరిశోధన పర్యవేక్షకుడు. పైగా వందల గ్రంథాలకు పీఠికాకర్త. కావ్య కన్యకల కన్న తల్లి దండ్రులు పూర్వ, సమకాలిక కవులను అర్థించి తమ కావ్య కన్యకలకు పీఠికా కళ్యాణ తిలకం దిద్దమని కోరాలనుకోవటం, కోరటం ముదావహం. వాళ్ళ కోరిక మన్నించటం కలల సౌజన్యం. పీఠికల బొట్టూ కాటుక పెట్టి, ఇంత పౌడరు రాసి కావ్య కన్యకల్ని సహృదయుల సన్నిధికి పంపటం సంతోష సంపాదకం. ఇంత సంతోషమైన శుభకార్యం శిఖామణి నిర్వహించారు. ఆచార్య కె. సంజీవరావు శిఖామణిగా జగమెరిగిన కవి. పరిశోధకుడు సత్య సంధాత. కవి. సృజనశీలి. పరిశోధకుడు. వస్తుతత్త్వ ఆలోచన కర్త. కవి హృదయతత్త్వ అనుభూతి వేత, పరిశోధకుడు కవి కలిస్తే ఆలోచనానుభూతులు సంగమిస్తాయి. పరిశోధకులు సత్యం చెబుతారు. కవులు కల్పనలు అందిస్తారు. సత్య కల్పనలు సరిగమలు పాడితే రాగం పుడుతుంది. అనురాగం పండుతుంది. ఆ రాగానురాగాల పంట ఈ గ్రంథం. దీనికి పరిశోధకకవి శిఖామణి పీఠికలు' అని పేరు పెట్టాడు. సంజీవరావుకు శిఖామణి' ఎక్కువ ఇష్టంగా ఉన్నట్లుగా ఉంది. కవిత్వానికి శిఖామణి, పరిశోధనకు సంజీవరావు ప్రసిద్ధులు. పీఠికల శీర్షికలన్నీ కవిత్వమే ! అందుకే వీటిని శిఖామణికే సొంతం చేశాడు. నిజానికది సంజీవరావు ఆస్తి హక్కు ఈ వ్యక్తికి ఆచార్యుడు ఒక పార్శ్వం కవి మరో పార్శ్వం . ఆచార్యుడికి కూడా కవే ఎక్కువ ఇష్టమయినట్లుంది. అందుకే ఇవి శిఖామణి పీఠికలయ్యాయి. | ఇవి ఇలా కావటానికి కారణం పీఠికల శీర్షికలన్నీ కవిత్వమే కావటం. పీఠికా సాహిత్యమంతా కవిత్వమే. కవిత్వం నిండా ప్రేమే ! పీఠికలనిండా ప్రోత్సాహమే ! కవిని, రచయితను, రచయిత్రిని, పరిశోధకుల్ని ప్రోత్సహించటమే లక్ష్యం. ఇందులో నూరుకు పైగా పీఠికలున్నాయి. ఈ పీఠికలు 15-20 ఏళ్ళుగా వ్రాస్తున్నట్లు కనిపిస్తుంది, రాసిన పీఠికలన్ని ఆచార్యుడి దగ్గర ఉండటంకానీ, తన పీఠికలతో ముద్రించిన గ్రంథాలన్నీ ఆయా గ్రంథకర్తలు వాటిని కవి దగ్గరకు చేర్చటంకానీ, గొప్ప విషయాలే ! ఇది ఎంతలేదన్నా 500 పేజీల మహాగ్రంథం కావటం ఖాయం. ఇంత పెద్ద పీఠికా గ్రంథం ఇంతకు ముందు ఎక్కడా చూచి ఉండం. ఇదొక చరిత్ర. ఆధునికుల మాటల్లో ఇదొక రికార్డు...........© 2017,www.logili.com All Rights Reserved.