శిఖామణి మువ్వల చేతికర్రతో తెలుగుకవితా ప్రపంచంలో చంద్రోదయంలా ప్రభవించాడు. అతని రాకతో కవిత్వ చంద్రోదయమై రజత కాంతులు వెదజల్లింది. మువ్వల చేతికర్ర సవ్వడులు అంతకంతకు అధికమై ఒక నాలుగు దశాబ్దాలుగా ధ్వనిస్తూనే వున్నాయి. అవిచ్ఛిన్న సుదీర్ఘ కవిత్వ ప్రయాణంలో అనేక ఉద్యమపాయాల్ని తనలో సంలీనం చేసుకుని తను తనుగా మిగిలాడు. వస్తురూపాల్లో అతను అచ్చమయిన దేశీయ కవి. వస్తువును బహు మృదువుగా తీర్చిదిద్దటం అతని ప్రత్యేకత. కొన్ని వేల సంవత్సరాల సంస్కారధారఏదో కర్షక, శ్రామిక హృదయ సంబంధిఏదో అతని అంతరాంతరాల్లో ప్రవహిస్తూనే వుంది. ఒక్కొక్క కవితని ఒక 'బాలె' లాగా ట్రీట్ చేయటం అతనికి తెలుసు..
దేశీయమైన ఒక కథాకథన పద్ధతి అతని కవితలన్నింటినీ Shape (షేప్) చేసింది. అనన్వయంగానీ, భావక్లిష్టతగానీ లేని ఒక పైరగాలిలాంటి కవి. యానగాలి లాంటి కవి. అవిచ్చిన్నత ఒక గొప్ప సుగుణమనుకుంటాను. జీవితాన్ని, సమాజాన్నీ, ప్రపంచాన్ని అవలోడనంచేసి, గర్భీకరించుకుని తనదయిన జీవన తాత్వికతని, వేళ్ళనుంచి పుట్టుకొచ్చిన ఒక సారాన్ని అందించడంలో అగ్రగణ్యుడు. అతని వేదాంతం నేలవిడిచిన సాముగాదు. మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, ఇంకా వారి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఒక జీవన ప్రేమ, ఒక లౌల్యం, ఒక మగ్నత, ఒక ఆనందవీక్షణం - అనుభవంలోకొస్తుంది. కటువుగా పలకలేని ఒక మాతృమూర్తి లాలిపాట. జీవితాన్ని ఇంతగా ప్రేమించిన కవి అరుదు. తన చుట్టు వున్న మనుషుల్ని, మామూలు శ్రమజీవుల్ని తిరిగి తిరిగి పునః నిర్మించాడు, అమరుల్ని చేసాడు. పాఠకుణ్ణి వెంట తీసుకెళ్ళి భుజంమీద చెయ్యేసి కబుర్లు చెబుతూ కవితను నడపడం అతనికొక్కడికే సాధ్యమయ్యింది. అద్భుతమయిన అగ్రశ్రేణికవి, గొప్ప కవి శిఖామణి,
కె. శివారెడ్డి
సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత
శిఖామణి మువ్వల చేతికర్రతో తెలుగుకవితా ప్రపంచంలో చంద్రోదయంలా ప్రభవించాడు. అతని రాకతో కవిత్వ చంద్రోదయమై రజత కాంతులు వెదజల్లింది. మువ్వల చేతికర్ర సవ్వడులు అంతకంతకు అధికమై ఒక నాలుగు దశాబ్దాలుగా ధ్వనిస్తూనే వున్నాయి. అవిచ్ఛిన్న సుదీర్ఘ కవిత్వ ప్రయాణంలో అనేక ఉద్యమపాయాల్ని తనలో సంలీనం చేసుకుని తను తనుగా మిగిలాడు. వస్తురూపాల్లో అతను అచ్చమయిన దేశీయ కవి. వస్తువును బహు మృదువుగా తీర్చిదిద్దటం అతని ప్రత్యేకత. కొన్ని వేల సంవత్సరాల సంస్కారధారఏదో కర్షక, శ్రామిక హృదయ సంబంధిఏదో అతని అంతరాంతరాల్లో ప్రవహిస్తూనే వుంది. ఒక్కొక్క కవితని ఒక 'బాలె' లాగా ట్రీట్ చేయటం అతనికి తెలుసు.. దేశీయమైన ఒక కథాకథన పద్ధతి అతని కవితలన్నింటినీ Shape (షేప్) చేసింది. అనన్వయంగానీ, భావక్లిష్టతగానీ లేని ఒక పైరగాలిలాంటి కవి. యానగాలి లాంటి కవి. అవిచ్చిన్నత ఒక గొప్ప సుగుణమనుకుంటాను. జీవితాన్ని, సమాజాన్నీ, ప్రపంచాన్ని అవలోడనంచేసి, గర్భీకరించుకుని తనదయిన జీవన తాత్వికతని, వేళ్ళనుంచి పుట్టుకొచ్చిన ఒక సారాన్ని అందించడంలో అగ్రగణ్యుడు. అతని వేదాంతం నేలవిడిచిన సాముగాదు. మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, ఇంకా వారి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఒక జీవన ప్రేమ, ఒక లౌల్యం, ఒక మగ్నత, ఒక ఆనందవీక్షణం - అనుభవంలోకొస్తుంది. కటువుగా పలకలేని ఒక మాతృమూర్తి లాలిపాట. జీవితాన్ని ఇంతగా ప్రేమించిన కవి అరుదు. తన చుట్టు వున్న మనుషుల్ని, మామూలు శ్రమజీవుల్ని తిరిగి తిరిగి పునః నిర్మించాడు, అమరుల్ని చేసాడు. పాఠకుణ్ణి వెంట తీసుకెళ్ళి భుజంమీద చెయ్యేసి కబుర్లు చెబుతూ కవితను నడపడం అతనికొక్కడికే సాధ్యమయ్యింది. అద్భుతమయిన అగ్రశ్రేణికవి, గొప్ప కవి శిఖామణి, కె. శివారెడ్డి సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత© 2017,www.logili.com All Rights Reserved.