బౌద్ధం ఒక చారిత్రక విశేషం మాత్రమే కాదు, సమకాలీన , ఆధునిక సమాజానికి కూడా వర్తించే అంశాలు అందులో అనేకం ఉన్నాయి. కుల, వర్గాలకు అతీతంగా, పురుషులనూ, స్త్రీలనూ సమాన దృష్టితో చూస్తూ, పండితులు, పామరులూ అనే విభజన చేయకుండా, సాధువులూ, సంసారులూ అనే తేడాలు చూపకుండా - రేడువేల సంవత్సరాల క్రితమే - ప్రతి ఒక్కర్ని అక్కున చేర్చుకున్న ఏకైక ధర్మంగా బౌద్ధం ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఎవరేది చెప్పినా విశ్వసించనవసరం లేదని, ఎవరికీ వారు స్వయంగా జ్ఞానాన్వేషణ చేసుకోవాలని, ఎవరి మౌక్షసాధనకు వాళ్లే పాటుపడాలని చెప్పిన ధర్మం అప్పటికి, ఇప్పటికి బౌద్ధం ఒక్కటే. బౌద్ధాన్ని అనుసరించే వ్యక్తుల ఆహారపు అలవాట్ల పై ధర్మం ఎట్టి నిషేధాలను విధించలేదని, బుద్ధుడు మరణించిన కొన్ని వందల ఏళ్ల వరకు అతడికి విగ్రహపూజలు జరపలేదని తెలుసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది.