దేశవ్యాప్తంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి జాతీయోద్యమం, తెలంగాణలో అదే రూపంలో జరగలేదు. ఇది నిజాము పాలకుడిగా కలిగిన దేశీయ రాజ్యం కావడం మూలంగా, దేశీయ సంస్థానాలలో ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించని కారణంగా, ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలిత భారతదేశంలో వలె స్వాతంత్ర్యోద్యమం జరగలేదు. అయితే, విమోచన కోసం పోరాటం జరగకపోలేదు. జవాబుదారీ పాలన కావాలని, ప్రజాస్వామ్యం కావాలని తెలంగాణ ప్రజానీకం కూడా ఉద్యమించింది. భూపతి వెంకటేశ్వర్లుకు తెలంగాణ యోధులెవరో తెలుసు. ఎవరెవరిని స్మరించుకుంటే తెలంగాణ అస్తిత్వానికి న్యాయం జరుగుతుందో తెలుసు. అందుకే, ఈ పుస్తకంలో 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుల దగ్గరి నుంచి, తెలంగాణ రైతాంగ సమరయోధుల దాకా యాది చేసుకున్నారు.