నా చిన్నతనంలో నాకన్నీ తెలుసుననిపించేది. తెలిసినవాటి గురించే వీరంతా ఎందుకిలా పదే పదే చెబుతున్నారనీ అనిపించేది. భూమి గుండ్రంగా ఉండును, ఆకాశం నీలంగా ఉండును. చుక్కలు మిణుకు మిణుకు మనుచుండును. సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమించును. ఇల్లాగా.. భూమి గుండ్రంగా ఉన్నది అన్నది తప్ప, మిగతావన్నీ నేను చూస్తూనే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నారు? తెల్సేది కాదు. కొంచెం వయసొచ్చాక మెల్ల మెల్లగా అనుమానాలు మొలకెత్తటం ప్రారంభమయింది. నీరు పల్లం నుండి మెరక మీదికి ఎందుకు ప్రవహించదు? గాలి వీస్తున్నట్టుగా తెలుస్తుంది కాని ఎలా ఉంటుంది? చూద్దామంటే ఎందుకు కనిపించదు? గ్లాసులో ఉన్న నీరు రెండు రుచుల్లో ఎందుకున్నాయి? ఇలాంటి సందేహాలు సవాలక్ష దాకా ఉన్నాయి.
వీటన్నింటిలోనూ, వీటన్నింటి వెనుక చాలా కారణాలున్నాయన్న సంగతి మెల్లమెల్లగా తెలసుకుంటూ, వస్తూవస్తూ ఉంటే, ఇంకా తెలుసుకోవలసినవి అపారంగా మిగిలిపోతున్నాయని అనిపిస్తూ ఉంది. ఎంత మహా వృక్షమయినా, ఓ చిన్ని విత్తనంలో వొదిగొదిగా ఉన్నట్లే ఎంత గొప్ప సత్యమయినా ఓ చిన్న అంశంలో వొదిగొదిగి ఉంటుంది. అలా ఉంటుందనడానికి, శ్రీ భూపతి రామారావు గారి ఈ 'మీకు తెలుసా? అన్న పుస్తకం ఒక ఉదాహరణ!
నా చిన్నతనంలో నాకన్నీ తెలుసుననిపించేది. తెలిసినవాటి గురించే వీరంతా ఎందుకిలా పదే పదే చెబుతున్నారనీ అనిపించేది. భూమి గుండ్రంగా ఉండును, ఆకాశం నీలంగా ఉండును. చుక్కలు మిణుకు మిణుకు మనుచుండును. సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమించును. ఇల్లాగా.. భూమి గుండ్రంగా ఉన్నది అన్నది తప్ప, మిగతావన్నీ నేను చూస్తూనే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నారు? తెల్సేది కాదు. కొంచెం వయసొచ్చాక మెల్ల మెల్లగా అనుమానాలు మొలకెత్తటం ప్రారంభమయింది. నీరు పల్లం నుండి మెరక మీదికి ఎందుకు ప్రవహించదు? గాలి వీస్తున్నట్టుగా తెలుస్తుంది కాని ఎలా ఉంటుంది? చూద్దామంటే ఎందుకు కనిపించదు? గ్లాసులో ఉన్న నీరు రెండు రుచుల్లో ఎందుకున్నాయి? ఇలాంటి సందేహాలు సవాలక్ష దాకా ఉన్నాయి. వీటన్నింటిలోనూ, వీటన్నింటి వెనుక చాలా కారణాలున్నాయన్న సంగతి మెల్లమెల్లగా తెలసుకుంటూ, వస్తూవస్తూ ఉంటే, ఇంకా తెలుసుకోవలసినవి అపారంగా మిగిలిపోతున్నాయని అనిపిస్తూ ఉంది. ఎంత మహా వృక్షమయినా, ఓ చిన్ని విత్తనంలో వొదిగొదిగా ఉన్నట్లే ఎంత గొప్ప సత్యమయినా ఓ చిన్న అంశంలో వొదిగొదిగి ఉంటుంది. అలా ఉంటుందనడానికి, శ్రీ భూపతి రామారావు గారి ఈ 'మీకు తెలుసా? అన్న పుస్తకం ఒక ఉదాహరణ!© 2017,www.logili.com All Rights Reserved.